Devotional

Karkataka Rashi:మీ రాశి కర్కాటక రాశి…ఈ రాశిలో పుట్టటం అదృష్టమా…దురదృష్టమా….???

Karkataka Rashi:కర్కాటక రాశి వారికి శని దేవుడితో పాటు గురు గ్రహాల ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. అంతేకాదు రాహు-కేతువుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగు పడే అవకాశాలున్నాయి. మీరు శారీరక, మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. ఏడాది ప్రారంభంలో కుజుడి ప్రభావం కూడా ఉంటుంది. మరోవైపు శని దేవుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్లడం వల్ల ఈ రాశి వారికి శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.

జ్యోతిష్యం అనేది రాశి చక్రం మరియు గ్రహాల కదలికలను బట్టి చెప్పుతారు. రాశి చక్రం అనేది పన్నెండు రాశుల బట్టి, ఒక వ్యక్తి పుట్టిన నక్షత్రం బట్టి చెప్పుతారు. 
రాశి చక్రం ద్వారా ఆ వ్యక్తి పుట్టిన రాశి, వాటి లక్షణాలు చెబుతుంటారు.జ్యోతిష్య శాస్త్రంలో కర్కాటక రాశి నాలుగో రాశి, కర్కాటకం అంటే పీత అని అర్ధం. పునర్వసు 4వ పాదము, పుష్యమి,ఆశ్లేష 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకు వస్తారు.

పంచభూతాలలో వీరు నీరుకి చెందుతారు. అందుకే ఈ రాశి వారికీ చంచల మనస్తత్వం ఉంటుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారికి ధర్మ రక్షణ,ఆత్మ రక్షణ ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారు ఏమి అనుకుంటారో అనిసంశయం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారికి బాధ,అసహనం,కోపం వంటివి కలగకుండా  ప్రయత్నం చేస్తారు.

ఇతరుల అభిప్రాయానికి విలువ ఇస్తారు. ఇతరులపై అధికారం చెలాయించటానికి ఏ మాత్రం ఇష్టపడరు. కర్కాటక రాశివారికి చంచల మనస్తత్వం ఉండుట వలన తరచూ అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశివారిలోఊహాశక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. కర్కాటక రాశివారికి కోపం వచ్చిన ఎక్కువ సేపు ఉండదు. అలాగే క్షమించే గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఈ రాశివారు విశ్రాంతి లేకుండా ఎప్పుడు ఎదో ఒక పనితో బిజీగా ఉంటారు. కర్కాటక రాశివారిని అంచనా వేయటం చాలా కష్టం. వారి మనస్సులో ఏముందో ఒక పట్టాన అర్ధం కాదు. వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది.

ఏ విషయం గురించి అయిన లోతుగా ఆలోచన చేస్తారు. తొందరగా ఒక నిర్ణయానికి రారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. భవిష్యత్ గురించి భయం,బెంగ ఉంటాయి. ఈ రాశి వారిపై ఎదుటి వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. చిన్న చిన్నసమస్యలకే కంగారూ పడిపోతారు. ఎవరి తోడు లేకుండా ఏ పని చేయలేరు. ఈ రాశి వారు వారు చేసే పనితో అందరినీ మెప్పిస్తారు. చేసే ప్రతి పనిలో ప్రత్యేకతను చూపుతారు. ఈ రాశివారి మాట ఎవరైనా వినకపోతే లోలోపలే చాలా కుమిలిపోతారు.

ఈ రాశివారు సౌకర్యాల విషయంలో ఏమైనా ఇబ్బందులు వస్తే అసలు తట్టుకోలేరు. చదువు విషయానికి వస్తే అనేక మంది విద్యార్థులు సమాధానం చెప్పడానికి చేతులు ఎత్తుతుంటే, ఒక్క కర్కాటక రాశి వారు మాత్రం తమను అడిగినప్పుడే సమాధానం ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు.

మరియు సమాధానం తెలిస్తేనే చెప్తారు. (వాస్తవానికి, ఇది చాలా గొప్ప లక్షణం). వారు క్లాసులో తరచుగా తిరుగుతూ ఉంటారు, వీరు మార్కులను తమ తెలివి తేటలకు ప్రామాణికాలుగా పరిగణించరు. ఎక్కువ విషయ పరిజ్ఞానం పరంగానే అభ్యాసపాఠవాలను కలిగి ఉంటారు.

కర్కాటక రాశి వారు ఎటువంటి విషయంలో అయినా ఆచితూచి అడుగులు వేస్తారు. వీరికి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్న ఓపిక,ఆలోచన ధోరణి కారణంగా మంచి జీవిత భాగస్వామి వస్తారు.

ఈ రాశికి చెందిన వ్యక్తులలో భావోద్వేగాలు అధికంగా కనిపిస్తాయి. అభద్రతా భావం కూడా కనిపిస్తుంది. అలాగే, సందిగ్ధంగా ఉంటారు. ఇవి వీరి సహజ స్వభావాలు. కర్కాటక రాశి వారి జ్ఞాపకశక్తి అపారం. ఈ రాశికి చెందిన వారు తమ దగ్గరివారు తమని తిరస్కరిస్తారేమోనన్న భయంతో ఊగిసలాడతారు. వీరు సులభంగా హర్ట్ అవుతారు.పరిస్థితులకు తగ్గట్టుగా మారటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ