Gem Stones : ఈ రత్నాన్ని ధరిస్తే అదృష్టం మీ వెంటే.. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు
Gem Stones : ఈ రత్నాన్ని ధరిస్తే అదృష్టం మీ వెంటే.. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు..ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది వారి జాతకానికి సెట్ అయ్యేలా రత్నాలను ధరిస్తున్నారు. ఈ రత్నాన్ని ధరిస్తే మీ లైఫ్ లో ఊహించని అద్భుతాలు ఖాయం.. జాతకాలు, జ్యోతిష్యం మీద సెంటిమెంట్స్, నమ్మకాలూ ఎక్కువే. అందుకే తమ నక్షత్రం, రాశి ఆధారంగా రంగురాళ్లను ధరిస్తూ ఉంటారు.
రంగు రాళ్లను పొదిగిన ఉంగరాలను చేతికి పెట్టుకుంటారు. అయితే ఇటువంటి రాళ్లు పొదిగేటప్పుడు నాణ్యతను కూడా చూసుకోవాలని లేకుంటే ఫలితం రాదని పండితులు సూచిస్తుంటారు.
పండితుల పట్ల వ్యత్సాసాలు ఉన్నా, చాలామంది పండితుల అంచనా ప్రకారం చూస్తే, మేషరాశి వాళ్ళకు కుజగ్రహం అధిపతి కనుక ఎరుపు రంగు పగడపు రత్నం ధరిస్తే మంచిదట. వృషభ రాశివారికి శుక్రగ్రహం అధిపతి కనుక వజ్రపుటుంగరం / వజ్రపు గొలుసు ధరించాలని పండితుల సూచన. మిధున రాశివాళ్ళు పచ్చ / మరకతం రంగు రాయిని ధరించాలి.
బుధ గ్రహం అధిపతిగా గల కన్య రాశి వాళ్ళు కూడా ఇదే ధరిస్తే మంచిదట చంద్రుడు అధిపతిగా గల కర్కాటక రాశివాళ్ళు ముత్యం ధరిస్తే మంచిదట. సూర్యుడు అధిపతి గా గల సింహరాశి వాళ్ళు ఎర్రటి కెంపు ధరించడం మంచిదని పండితుల సూచన. ఇక శుక్ర గ్రహం అధిపతిగా గల తులా రాశివాళ్ళు వజ్రపుటుంగరం / వజ్రపు గొలుసు ధరిస్తే మంచిదని పండితుల సూచన.
అంగారక గ్రహం పాలించే వృచ్చిక రాశివాళ్ళు ఎర్రటి పగడపు రాయి ధరిస్తే మంచిదని అంటున్నారు. గురుగ్రహం అధిపతిగా గల ధనుస్సు రాశివాళ్ళు పసుపు నీలమణి ధరిస్తే మంచిదని పండితుల సూచన. శనిగ్రహం అధిపతిగా గల మకర రాశివాళ్ళు అలాగే కుంభరాశి వాళ్ళు కూడా నీలం రంగు నీలమణి ధరిస్తే మంచిదట. గురుగ్రహం పాలించే మీన రాశివాళ్ళు పసుపు నీలమణి ధరిస్తే శుభాలు కలుగుతాయట.
కాబట్టి మీ జాతకాన్ని బట్టి రాయిని ధరించి దానికి తగ్గట్టుగా ఫలితాలను పొందండి. అయితే ఈ ఆర్టికల్ కేవలం జాతకాల మీద నమ్మకం ఉన్నవారికి మాత్రమే. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనలో కొంత మంది జాతకాలను అసలు నమ్మరు. ఏదైనా నమ్మకం ఉంటేనే ముందు అడుగు వేయాలి. నమ్మకం లేకపోతే అసలు ముందు అడుగు వేయకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ