Sivalayam mistakes:శివాలయానికి వెళ్ళినప్పుడు నూటికి 99 మంది చేసే అతి పెద్ద తప్పు ఇదే…
sivalayam mistakes: శివాలయానికి వెళ్ళినప్పుడు నూటికి 99 మంది చేసే అతి పెద్ద తప్పు ఇదే…మనలో చాలా మంది గుడికి వెళ్ళుతు ఉంటారు. కొంత మంది ప్రతి రోజు వెళ్ళుతు ఉంటారు. మరి కొంత మంది వారంలో ఒకసారి వెళ్ళుతు ఉంటారు. శివాలయానికి వెళ్ళే వారు తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు.
శివాలయానికి వెళ్ళినప్పుడు నూటికి 99 మంది చేసే అతి పెద్ద తప్పు ఇదే… ఆ తప్పు ఏమిటో తెలుసా.. మనలో చాలా మంది గుడికి వెళ్ళుతూ ఉంటారు. పరమ శివుణ్ణి మనస్సు పెట్టి ప్రార్ధిస్తే మనం కోరిన కోరికలు అన్ని తీరుస్తారు. పరమ శివుడు లయకారుడు. మిగతా దేవతలతో పోలిస్తే శివుణ్ణి పూజించే విధానం కాస్త బిన్నంగా ఉంటుంది.
శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ,పువ్వులు,అభిషేకానికి కావలసిన పూజ ద్రవ్యాలు వంటి వాటిని తీసుకువెళ్ళుతూ ఉంటాం. అయితే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్ల కారణంగా శివుని అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ పొరపాట్ల గురించి తెలుసుకుందాం.
ఆ పొరపాట్ల గురించి తెలుసుకుంటే ఆ పొరపాట్లు చేయకుండా శివుని అనుగ్రహం పొందవచ్చు. మనం శివాలయంనకు వెళ్ళినప్పుడు పరమాన్నం లేదా పులిహోర,పండ్లు,కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా పెడుతూ ఉంటాం. మనం శివునికి ఏమి నైవేద్యం పెట్టిన సరే శివాలయం నుండి ఇంటికి తిరిగి తీసుకురాకూడదు. ఆలా నైవేద్యం ఇంటికి తీసుకురావటం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే శివుని దగ్గర చండీశ్వరుడు అనే ఒక దేవుడు ఉంటారు. శివలింగానికి అభిషేకం చేసినప్పుడు అభిషేకం
చేసిన నీరు ఎక్కడ నుండి వస్తుందో అక్కడ చండీశ్వరుడు ఉంటారు. మనం అభిషేకం నీటిని తీర్థంగా తీసుకుంటాం. మన పురాణాల ప్రకారం మనం శివునికి సమర్పించిన వాటిని చండీశ్వరుడు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. కాబట్టి మనం శివాలయంలో శివునికి సమర్పించిన వాటిని ఆలయంలోనే వదిలేయాలి. కానీ ఇంటికి తీసుకురాకూడదు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియక శివాలయం నుండి ప్రసాదం ఇంటికి తెస్తూ ఉంటారు. ఇదే నూటికి 99 మంది చేసే అతి పెద్ద తప్పు.
అయితే శివాలయం నుండి కొంచెం అయినా ప్రసాదం తెచ్చుకోవాలంటే చండీశ్వరుడు దగ్గరకు వెళ్లి చిటికెలు లేదా చప్పట్లు కొట్టి అయన అనుమతి తీసుకోని ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు అనుమతి తీసుకోని శివ దర్శనం చేసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ