Bay Leaf:ఇంటిలో బిర్యానీ ఆకు కాల్చిన 10 నిమిషాల తర్వాత ఏమి జరుగుతుందో తెలుసా..?
Bay Leaf:ఇంటిలో బిర్యానీ ఆకు కాల్చిన 10 నిమిషాల తర్వాత ఏమి జరుగుతుందో తెలుసా.. మనం ప్రతి రోజు ఉపయోగించే మసాలా దినుసుల్లో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు. బిర్యానీ ఆకును మనలో చాలా మంది బిర్యానీ,పలావ్ వంటి మసాలా వంటకాలలో వేస్తూ ఉంటారు. వీటిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బిర్యానీ ఆకును తేజపత్ర, తమలపత్ర, బే ఆకు అని కూడా పిలుస్తారు. మనలో చాలా మందికి బిర్యానీ ఆకు అంటే ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు.
ఈ ఆకులో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బిర్యానీ ఆకును ఇంటిలో కాల్చితే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. మనస్సుకు ప్రశాంతత కలగటానికి మనం ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సువాసనలను పీల్చినప్పుడు మనస్సుకు ప్రశాంతంగా అన్పిస్తుంది.
ఈ విధంగా వాసనల ద్వారా రుగ్మతలను తగ్గించే ప్రక్రియను ‘అరోమా థెరపీ’ అని అంటారు. అయితే మనం వంటల్లో ఉపయోగించే ఒక రకమైన ఆకును కాల్చి పీల్చటం ద్వారా కూడా మనస్సు ప్రశాంతత కలుగుతుంది. అది బిర్యానీ ఆకు. బిర్యానీ తినేవారికి ఈ ఆకు సుపరిచితమే. ఈ ఆకును బిర్యానీలో ఉపయోగించటం వలన బిర్యానీకి ఒక రకమైన రుచి ,వాసన వస్తాయి.
రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకుని ఒక గదిలో కాల్చండి. దీంతో వాటి నుంచి పొగ వస్తుంది. ఈ సమయంలో గది నుంచి బయటికి వెళ్లి తలుపులు మూసేయండి . ఆ విధంగా ఒక 10 నిమిషాల పాటు తలుపులను మూసి ఉంచండి. దాంతో ఆ పొగ అంతా గదిలో బాగా వ్యాపిస్తుంది. ఆ తర్వాత గదిలోకి వెళ్లి చూడండి.
మంచి వాసన వస్తుంది. ఆ వాసనను పీల్చండి. దాంతో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన అంతా మటుమాయం అవుతుంది. అంతేకాదు గది అంతా సువాసనా భరితంగా ఉంటుంది. దోమల వంటి పురుగులు ఏవైనా ఉంటే పారిపోతాయి. కాబట్టి ఈ విధంగా చేసి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ