Jaggery Vs suger :ఆహారంలో చక్కెరకు బదులుగా బెల్లం చేర్చుకుంటే జరిగేదేంటి.. ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..
Jaggery Vs suger :ఆహారంలో చక్కెరకు బదులుగా బెల్లం చేర్చుకుంటే జరిగేదేంటి.. ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే…. మనలో చాలా మందికి బెల్లం,పంచదారలలో ఏది ఆరోగ్యానికి మంచిది…అనే విషయంలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఈ రోజు అ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. బెల్లంలో అమైనో ఆమ్లాలు, ఫినాలిక్, యాంటీఆక్సిడెంట్లు మరియు కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ మరియు విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన ఈ మధ్య కాలంలో కొన్ని chocolate లలో పంచదారకు బదులుగా బెల్లంను వాడుతున్నారు.
బెల్లం,పంచదార రెండూ కూడా చెరకు నుండి తయారవుతాయి. బెల్లం బంగారు-గోధుమ రంగులో ఉంటుంది, అయితే చక్కెర తెలుపు మరియు స్ఫటికాకారంగా ఉంటుంది. చక్కెర తెలుపు రంగు కారణంగా అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు, పంచదార ఆహార పదార్థాల రంగును మార్చదు. పంచదార కన్నా బెల్లంలోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
బెల్లంలో ఉండే పాలీఫెనాల్స్ దాని బయోయాక్టివిటీకి దోహదం చేస్తాయి. కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. బెల్లం యాంటీ-అలెర్జీ లక్షణాలను కలిగి ఉండుట వలన ఆస్తమా సంబంధిత సమస్యలను మరియు ఒత్తిడిని తగ్గించటానికి సహాయపడుతుంది.
100 గ్రాముల బెల్లంలో 70-90 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది, ఇది రక్త నాళాలను రక్షించడానికి, కండరాలను సడలించి నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. బెల్లంలోని పొటాషియం రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బెల్లంలో తక్కువ స్థాయిలో కాల్షియం, ఫాస్పరస్ మరియు జింక్ ఉంటాయి. ఇవన్నీ మంచి రోగనిరోధక శక్తిని మరియు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
రక్తాన్ని శుభ్రపరచడం, రుమాటిక్ వ్యాధులను నివారించడం మరియు కామెర్ల చికిత్సలో సహాయపడుతుంది. సెలీనియం కారణంగా, బెల్లం యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తుంది. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది, ఆకలి లేనివారిలో ఆకలిని పుట్టిస్తుంది.
మనలో చాలా మంది భోజనం అయ్యాక చిన్న బెల్లం ముక్క తింటూ ఉంటారు. అలా తినటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. పంచదారలో లేని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బెల్లంలో ఉన్నాయి. బెల్లం ఎర్ర రక్త కణాల ఆక్సీకరణను గణనీయంగా తగ్గిస్తుంది.
బెల్లంలో ఉండే ఫినోలిక్స్ మరియు ఇతర ఫైటోకెమికల్స్ యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటాయి. బెల్లం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, రోగనిరోధక శక్తిని పెంచే మరియు సెల్-ప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉందని కూడా నిరూపించబడింది. బెల్లంలోని విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా పిరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గిస్తుంది.
ఇలా చూసుకుంటే పంచదార కన్నా బెల్లంలోనే ఎక్కువ పోషకాలు మరియు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి పంచదార తినే ఆలవాటు ఉన్నవారు కూడా బెల్లం తినటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది. ఈ సీజన్ లో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ