Beauty TipsHealth

Hair Loss tips Telugu : జుట్టు రాలే సమస్యకు ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే అంతా సెట్..

cloves and lemon Hair Loss Tips In telugu :జుట్టు రాలే సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే జుట్టు ఊడిపోయి బట్టతల రావడాన్ని చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. జుట్టు రాలే సమస్య ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారూ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. అయితే చాలా మంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
Cloves water Health benefits In telugu
అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించటానికి లవంగాలు బాగా సహాయపడతాయి. లవంగాలలో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం జుట్టు ములాలకు బలాన్ని అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

లవంగాలలో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనం జుట్టు కుదుళ్లలో రక్తప్రసరణను మెరుగుపరిచి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ప్రేరణ కలిగిస్తుంది. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడెక్కాక రెండు స్పూన్ల లవంగాలను వేసి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి. నీళ్లు బాగా మరిగి రంగు మారతాయి.
hair fall tips in telugu
ఈ నీటిని రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం వడగట్టి దానిలో అర చెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. ఈ నీటిని జుట్టు మీద స్ప్రే చేసి సున్నితంగా మసాజ్ చేయాలి ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టులో ఉన్న ఇన్ఫెక్షన్ అన్ని తొలగిపోయి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ