Devotional

February Month:పిబ్రవరి నెలలో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే…మీ రాశి ఉంటే మీరు అదృష్టవంతులు

February Month:పిబ్రవరి నెలలో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే…మీ రాశి ఉంటే మీరు అదృష్టవంతులు..ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే కుతుహులంతో జాతకాలను ఆశ్రయిస్తూ ఉంటారు. వారి రాశి ప్రకారం రాశిఫలాలను చూసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది జాతకాలను అసలు నమ్మరు. ఈ వీడియో కేవలం జాతకాలను నమ్మే వారి కోసం మాత్రమే. ఫిబ్రవరి నెలలో ఏ రాశివారికి అదృష్టం కలిసి వస్తుందో, ఏ రాశివారికి సమస్యలు ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి

ఫిబ్రవరి నెలలో ఈ రాశివారికి వృతి,వ్యాపారాల యందు అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పని అనుకూలంగా ఉంటుంది. ధనవృద్ధి కలుగుతుంది. రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉన్నత అధికారులతో ఏమైనా పనులు ఉంటే ఈ నెలలో పూర్తి అవుతాయి. ఇంటిలో శుభకార్యం జరుగుతుంది. అతి విశ్వాసంతో నష్టాలు కలిగే అవకాశం ఉంది. దైవ కార్యక్రమాలలో మీ వంతు సాయాన్ని అందిస్తారు. దైనందిక కార్యక్రమాలు సజావుగా సాగక కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో 8,9,17,18,20 తేదీలలో ఏ ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటేనే మంచిది. ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు మొదట్లో అనుకూలంగా ఉన్నా చివరికి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. చేసే పనులలో రాహు కేతువులు భంగం కలిగిస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి.

వృషభ రాశి

ఫిబ్రవరి నెలలో వృషభ రాశివారికి వృతి,వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. రాజకీయాలలో చురుగ్గా ఉండి అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. ఈ రాశివారు ఫిబ్రవరి నెలలో కుటుంబం కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. మధ్యవర్తుల కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. రావాల్సిన బకాయిలు వస్తాయి. దాంతో వ్యాపారం సజావుగా సాగుతుంది. ఏ పని ప్రారంభించిన విజయవంతం అవుతుంది. ఉద్యోగులకు కొంచెం నిరాశగా ఉంటుంది. ఫిబ్రవరి చివరకు వచ్చేసరికి కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్ల నియంత్రణ ఉంటే మంచిది. మానసికంగా కాస్త సమస్యలు ఉన్నా అధికమిస్తారు. విద్యార్థులు కాస్త కష్టపడాలి.

మిధున రాశి

ఫిబ్రవరి నెలలో మిధున రాశివారు వినోదం కోసం కాస్త ఎక్కువగా ఖర్చు పెడతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వృతి,వ్యాపారాలలో వృద్ధి కనపడుతుంది. మీ జీవితంలో మార్పులు మీరు కోరుకున్న విధంగా ఉంటాయి. ఈ రాశివారు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ఫిబ్రవరి నెలలో 12,14,15,24,25 తేదీలలో ఏ ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆ తేదీలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు. మీరు చేసే పనులలో కుటుంబం,స్నేహితుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. పెద్దవారి మెప్పు పొందుతారు. అలాగే పెద్దవారు ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వటం ద్వారా ఈ రాశివారికి మంచి జరుగుతుంది. ఈ రాశివారు ఎంత కృషి చేస్తే అంత మంచి ఫలితం కనపడుతుంది. వీరు చాలా మనోనిబ్బరంగా ఉంటారు.

కర్కాటక రాశి

ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశివారికీ పరిస్థితులలో మెరుగుదల కనపడుతుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. స్థిరాస్తుల కొనుగోలుకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగం చెస్తున్నవారు పై అధికారులతో మెప్పు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ నెలలో కర్కాటక రాశివారు ఏ పనిని ప్రారంభించిన విజయవంతం అవుతుంది. కాబట్టి ఏ పనిని అయిన ప్రారంభించవచ్చు. మిమ్మల్ని అర్ధం చేసుకొనే వ్యక్తులు మీ జీవితంలో పరిచయం అవుతారు. వ్యాపారంనకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశివారికి 2,9,13,14,24,29 తెధీలలో ఏ ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆ తేదీలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు.సమస్యల పరిష్కారానికి మధ్యవర్తుల దగ్గరకు వెళ్ళటం వలన కాస్త నష్టపోయే అవకాశం ఉంది. బంధువుల కారణంగా కొన్ని సమస్యల నుండి బయట పడతారు.

సింహ రాశి

ఫిబ్రవరి నెలలో సింహ రాశివారి మాటకు ఎదురు ఉండదు. ఊహించని దానికన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చేసే ప్రతి పనిలో దేవుని సహకారం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తువులను అమర్చుకుంటారు. రాజకీయ నాయకులకు ఈ నెల అంత అనుకూలంగా ఉండదు. మిగతా రంగాలకు చెందిన వారికీ బాగానే కలిసి వస్తుంది. దూరపు ప్రయాణాలు చేస్తారు. అయితే భయం కారణంగా కొన్ని సమస్యలు వస్తాయి. శని గ్రహ అనుగ్రహం కారణంగా ఆర్ధికంగా చాలా బాగుంటుంది. అయితే ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారసత్వ సంపద విషయంలో కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. మోకాళ్ళ నొప్పులు,ఉదర సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త గా ఉండాలి.

కన్య రాశి

ఫిబ్రవరి నెలలో కన్య రాశి వారికి కుటుంబం నుండి బంధువుల నుండి స్నేహితుల నుండి మంచి సహకారం లభిస్తుంది. ఆశించిన ప్రోత్సహం లభించటం వలన జీవితంలో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశాలను బాగా అందిపుచ్చుకుంటారు. ఆర్ధికంగా స్థిరత్వం ఉంటుంది. సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారికి కూడా బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్స్,కోరుకున్న చోటుకి బదిలీలు ఉంటాయి. సొంత గృహ నిర్మాణానికి ఫిబ్రవరి నెల అనుకూలమైనది. మంచి ఫలితాల కోసం విద్యార్థులు కొంచెం కష్టపడాలి. 25,26,27 తేదీలలో ఏ ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆ తేదీలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు. కుటుంబ వ్యవహారాల విషయంలో కాస్త శ్రద్ద పెట్టాలి. లేకపోతే పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది.

తుల రాశి

ఫిబ్రవరి నెలలో తుల రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మంచి ఫలితాలను అందిస్తుంది. చేసే ప్రతి పనిని విజయవంతం చేస్తారు. ఆర్ధికంగా స్థిరత్వం ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టటానికి అనుకూలమైన సమయం. వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి. ఫైనాన్స్ వ్యాపారం చేసే వారికీ చాలా బాగుటుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కీళ్ళకు సంబందించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 18,19 తేదీలలో ఏ ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆ తేదీలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు. కుటుంబంతో ఎక్కువసేపు గడపటానికి ఇష్టపడతారు. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కుటుంబ మద్దతు ఉంటుంది.

వృశ్చిక రాశి

ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశివారు దూరపు ప్రయాణాలు చేయటం వలన ఆరోగ్యం కాస్త మందగించే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి బాగుండటంతో ఇంటిలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నూతన ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం మంచి వృద్ధిలో ఉంటుంది. 25,26,27 తేదీలలో పని భారం చాలా ఎక్కువగా ఉన్నా సరే పనులను పూర్తి చేయటంలో సఫలం అవుతారు. ఈ తేదీలలో ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే అనుకూలమైన ఫలితాలు ఉండవు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలలో బాధ్యతలు పెరుగుతాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికీ శని కారణంగా అనుకూలంగా ఉండదు. అధికంగా ధనం ఖర్చు అవుతుంది. కంటికి సంబందించిన సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనస్సు రాశి

ఫిబ్రవరి నెలలో ధనస్సు రాశి వారికీ ఆర్ధికంగా స్థిరత్వం ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు వస్తాయి. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలం అవుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు రావటం వలన కాస్త అశాంతిగా ఉంటారు. అలాగే మిత్రులతో కూడా కాస్త అననుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారం కాస్త స్లోగా ఉంటుంది. కొత్త పనులను వాయిదా వేయటం మంచిది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. చేసే పని భారం కాకుండా చేస్తారు. అయితే కాస్త శరీరకముగా బలహీనంగా ఉంటారు. రాహు కేతు గ్రహాల కారణంగా వైవాహిక జీవితంలో కొన్ని కలతలు వచ్చే అవకాశం ఉంది. గురు గ్రహం కారణంగా కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. దాంతో కాస్త అశాంతి కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

మకర రాశి

ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి ఆదాయం,వ్యయం సమానంగా ఉండుట వలన ఆర్ధికంగా కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. కుటంబంతో అనుబంధం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మాట పట్టింపులు తొలగిపోయి సఖ్యతగా ఉంటారు. గతంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఒక కొలిక్కి వస్తాయి. మిత్రుల ఆదరణ బాగుంటుంది. ఫిబ్రవరి చివరి వారంలో శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ నెలలో 6 వ తేదీ నుంచి 12 వ తేదీ మధ్యలో ఉద్యోగ ప్రయత్నాలు,ప్రమోషన్స్,కోరుకున్న చోటుకి బదిలీలకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. వ్యాపార విస్తరణలో స్నేహితుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు కాస్త కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. గురు గ్రహం కారణంగా వృత్తులలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలుగుతాయి. లక్ష్యం కోసం తీవ్రంగా కష్టపడాలి. అప్పుడే ఫలితం వస్తుంది. శని ఈ రాశివారికి ప్రతికూల ప్రభావాలను కలిగించటం వలన మిశ్రమ ఫలితాలు వస్తాయి.

కుంభ రాశి

ఫిబ్రవరి నెలలో కుంభ రాశివారికి అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చు పెట్టె సమయంలో కాస్త ఆలోచించి అడుగు వేయాలి. ఆర్ధిక ప్రణాళిక వేసుకున్న ఆ ప్రకారం చేయటంలో విఫలం అవుతారు. ఆరోగ్య సమస్యలు కూడా కాస్త ఇబ్బంది పెడతాయి. నమ్మకద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు హామీ ఇవ్వకూడదు. భూ సంబంధ క్రయ విక్రయాలు చేయకుండా ఉంటేనే మంచిది. నూతన గృహం విషయంలో కాస్త ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఆ ప్రయత్నాలను చేయకుండా ఉంటేనే మంచిది. 5,12,13 తేదీలలో ఏ ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆ తేదీలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు. సన్నిహితులతో హ్యాపీగాగడుపుతారు . గురు గ్రహం మంచి ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తుంది. కాబట్టి విద్యార్థులు కాస్త దృష్టి పెడితే మంచి ఫలితాలను అందుకుంటారు.

మీన రాశి

ఫిబ్రవరి నెలలో మీనా రాశివారు చేసే పని విజయవంతం కావటంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. నెల మొదట్లో కాస్త అశాంతి కలిగిన రోజులు గడిచే కొద్ది అశాంతి తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది. రాజకీయ నాయకులకు కోరుకున్న పదవులు,మంచి గుర్తింపు కలుగుతాయి. ఆర్ధిక అభివృద్ధి సమానంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు కలుగుతాయి. రాహు కేతు గ్రహాల కారణంగా బంధువులు,స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఏ పని చేసిన కాస్త శ్రద్ద పెడితే మంచి ఫలితాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ