Pooja:వారంలో ఏ రోజు ఏ దేవుణ్ణి ఏ పువ్వులతో పూజిస్తే మంచిది…మీకు తెలుసా…?
Dharma Sandehalu :దేవుణ్ణి ప్రతి రోజు ఏ పూలతో పూజిస్తే మంచిది? చాలా మందికి దేవుడి మీద భక్తి ఉంటుంది. అయితే చాలా మందికి దేవుణ్ణి ప్రతి రోజు ఏ పూలతో పూజిస్తే మంచిదో తెలియదు. అంతేకాక ఏ దేవుణ్ణి ఏ రోజున పూజించాలో కూడా తెలియదు. ఇప్పుడు దేవుణ్ణి ఏ పూలతో పూజించాలో తెలుసుకుందాం.
సోమవారం
సోమవారం శివుణ్ణి పూజించాలి. శివుని అనుగ్రం మన మీద ఉండాలంటే మారేడు దళాలు,తెల్లని పూలతో పూజ చేయాలి.
మంగళవారం
మంగళవారం ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు. ఈ రోజు ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించాలి. అలాగే మంగళవారం సుభ్రమణ్యస్వామికి ఎర్ర పూలతో పూజిస్తే స్వామి అనుగ్రహం పొందవచ్చు.
బుధవారం
బుధవారం ఆయప్పస్వామిని పూజించాలి. ఆయప్పస్వామిని చాలా నియమాలు మరియు భక్తి శ్రద్దలతో పూజించాలి. అలాగే వినాయకుడికి గరిక, తెల్ల జిల్లేడు, ఎర్ర గన్నేరు పూలతో పూజిస్తే స్వామి వారి కృపకు పాత్రులు అవుతాం.
గురువారం
గురువారం రోజున శ్రీరాముడు,లక్ష్మి నరసింహస్వామిని పసుపు పూలతో పూజించాలి. అలాగే సాయిబాబాకి కూడా గురువారం ఇష్టమైన రోజు. ఈ రోజు సాయిబాబాని భక్తి శ్రద్దలతో పూజిస్తే మంచి జరుగుతుంది.
శుక్రవారం
శుక్రువారం రోజున దుర్గా దేవికి ఎర్రని మందార పూలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
శనివారం
శనివారం వెంకటేశ్వరస్వామికి ఇష్టమైన రోజు. ఈ రోజు స్వామివారికీ తులసి మాల, నీలం రంగు పూలతో పూజించాలి. అలాగే నవగ్రహాలను కూడా నీలం రంగు పూలతో పూజిస్తే మంచిది.
ఆదివారం
ఆదివారం సూర్యున్ని పూజిస్తే మంచి జరుగుతుంది. అయితే సూర్యున్ని ఎర్రని పూలతో పూజించాలి.
ఈ విషయాలు అన్నీ ఒక అవగాహన కోసమే. మనలో చాలా మందికి ఏ వారంలో ఏ దేవునికి పూజా చేయాలి…ఏ పూలతో పూజా చేయాలి…అనే విషయాలు పెద్దగా తెలియవు. ఈ ఆర్టికల్ చదివాక నచ్చితే దీని ప్రకారం పూజా చేయటం ప్రారంభించండి. కాస్త శ్రద్దగా చేస్తే మంచి ఫలితం తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ