Healthhealth tips in telugu

Kiss Miss:కిస్ మిస్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…ముఖ్యంగా ఈ సీజన్ లో…మిస్ కావద్దు

Kiss Miss Health benefits In telugu :కిస్ మిస్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…ముఖ్యంగా ఈ సీజన్ లో…మిస్ కావద్దు కిస్ మిస్ లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కిస్ మిస్ సంవత్సరం పొడవునా లభ్యం అవుతాయి. అలాగే ఒకేసారి కొనుక్కొని నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ప్రతి రోజు 5 లేదా 6 కిస్ మిస్ లను తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
kismis Health benefits in telugu
కిస్ మిస్ లను అలానే తినవచ్చు. లేదా రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు నానిన కిస్ మిస్ లను తింటూ ఆ నీటిని తాగేయాలి. ఫైబర్ కారణంగా మలబద్ధకాన్ని కంట్రోల్ చేయవచ్చు.తిండి తిన్న తర్వాత ఆహారాన్ని బాగా జీర్ణం అయ్యేలా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
పొటాషియం గుండెకు సంబంధించిన కండర కణాలకు చాలా మేలును చేస్తుంది.

కిస్ మిస్ లో పొటాషియం, ఐరన్ లాంటి పోషక విలువలు ఉండడంతో పొట్టలోని ఆసిడ్ లెవల్స్ ను కంట్రోల్ చేయగలవు.దీంతో అసిడిటీ లాంటి సమస్యలను నివారించవచ్చు.రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు కిస్ మిస్ తింటే మంచి ఫలితం ఉంటుంది.

కిస్ మిస్ లను ఎక్కువగా తినకూడదు. మోతాదుకి మించి తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో తీపి,కేలరీలు ఎక్కువగా ఉండుట వలన బరువు పెరిగే అవకాశం ఉంది. కిస్ మిస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతిగా తింటే కడుపులో గడబెడ మొదలవుతుంది.
gas troble home remedies
పొట్ట ఉబ్బడం, గ్యాస్ వంటి రకరకాల సమస్యలొస్తాయి. ఏదైనా లిమిట్ గా తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి రోజుకి 5 లేదా 6 కిస్ మిస్ లను మాత్రమే తినాలి. కిస్ మిస్ ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ