Sabja Seeds:1 గ్లాసు శరీరంలో వేడిని తగ్గించటమే కాకుండా తలనొప్పి,ఒత్తిడి తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది
Refreshing summer drinks : 1 గ్లాసు శరీరంలో వేడిని తగ్గించటమే కాకుండా తలనొప్పి,ఒత్తిడి తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది..వేసవికాలం ఎండలు పెరిగిపోయాయి. శరీరంలో విపరీతమైన వేడి కారణంగా చెమట,కళ్ళ మంటలు,తలనొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. శరీరంలో వేడి తగ్గించటానికి ఒక అద్భుతమైన డ్రింక్ తయారీ గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ తాగితే శరీరంలో వేడి తగ్గటమే కాకుండా అలసట,నీరసం వంటివి అన్నీ తొలగిపోతాయి.
సబ్జా గింజలు శరీరంలో వేడిని తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ సబ్జా గింజలను వేసి నీటిని పోసి మూడు గంటలు నానబెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లో అరస్పూన్ సొంపు, చిన్న పటికబెల్లం ముక్క,రెండు యాలకులు, చిటికెడు నల్ల ఉప్పు వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి.
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి నానబెట్టిన సబ్జా గింజలు, మిక్సీ చేసిన పొడి, పది పుదీనా ఆకులను క్రష్ చేసి వేయాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం, నాలుగు ice cubes వేసి బాగా కలిపి గ్లాసు లోకి సర్వ్ చేయటమే. ఈ డ్రింక్ తాగితే శరీరంలో వేడి తగ్గటమే కాకుండా తలనొప్పి, ఒత్తిడి తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది.
ఈ డ్రింక్ రోజు విడిచి రోజు తాగవచ్చు. అలాగే బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఈ డ్రింక్ తాగితే చాలా రీఫ్రెష్ అనుభూతి కలుగుతుంది. అలసట, నీరసం వంటివి వెంటనే తొలగిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ