weight loss Drinks:Weight loss కోసం ట్రై చేయాల్సిన డ్రింక్స్.. ఉదయం పరగడుపున తాగితే..
Coriander Seeds Water : ఈ మధ్య కాలంలో అధిక బరువు అనేది సాధారణం అయ్యిపోయింది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. వాటి నుంచి బయట పడాలంటే ఖచ్చితంగా తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
పరగడుపున నానబెట్టిన ధనియాల నీరు తాగితే… ఎన్ని లాభాలో తెలుసా… సాధారణంగా ధనియాలు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి లేదేమో. వంటింటిలో పోపుల డబ్బాలో ఉండే ధనియాలు వంటింటి దినుసుగానే కాకుండా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.ధనియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇంటిలో పెద్దవారు ఉంటే ఇంటి చిట్కాలకు ధనియాలను తప్పనిసరిగా వాడతారు.
ఏ కూరలో అయినా కాస్త ధనియాల పొడి వేస్తే చాలు. ఘుమ ఘుమ లాడే సువాసనతో పాటు మంచి రుచిని అందిస్తుంది. కూరల్లో కొత్తిమీర ఎంత వాడినా మసాలా పొడిలో ధనియాలు కలిపితేనే రుచి వస్తుంది.ఈ మధ్య జరిగిన అధ్యయనాలలో ధనియాలు గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా, శరీరాన్ని చల్లబరిచేదిగా, అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా,రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుందని తేలింది.
కొత్తిమీర మొక్క నుండి కాచే ఈ ధనియాల కాయలను ఎండబెట్టి, ఆ తర్వాత గింజల రూపంలో లేదా,పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించు కుంటారు. ధనియాల్లో అనేక పోషకాలున్నాయి. వీటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయో వివరంగా తెలుసుకుందాం.
ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ధనియాలు వాడని వారు కూడా ధనియాలు వాడటం ప్రారంభిస్తారు.ధనియాల కాషాయం త్రాగటం వలన శరీరంలో వేడి తగ్గటమే కాకుండా జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం వంటివి కూడా తగ్గుతాయి.
ధనియాలను ఏ రూపంలో తీసుకున్న రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. ధనియాలను కషాయంగా తయారుచేసుకొని ప్రతి రోజు త్రాగితే మధుమేహం ఉన్నవారికి నియంత్రణలో ఉంటుంది. అలాగే మధుమేహం రాకుండా కూడా నిరోధిస్తుంది.
టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే లక్షణాలు ధనియాలలో ఉన్నాయి. ఆహారం కారణంగా ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్యలు నుండి ధనియాలు బయట పడేస్తోంది.
ధనియాల కషాయాన్ని రెగ్యులర్ గా త్రాగితే రక్తంలో చెడు కొలస్ట్రాల్ తొలగిపోతుంది. ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంను ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ధనియాల కషాయంలో పాలు, బెల్లం కలుపుకొని తాగితే బాగా నిద్రపడుతుంది. దాంతో నిద్రలేమి సమస్య కూడా తొలగిపోతుంది. పసుపులో ధనియాల పొడి లేదా రసాన్ని కలిపి మొటిమలపై రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
ధనియాలు విరివిగా లభ్యం అవుతాయి. అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ధనియాల పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. కానీ ధనియాల పొడిని ఇంటిలో తయారుచేసుకుంటేనే మంచిది. ధనియాలను వాడి ఇప్పుడు చెప్పిన అన్ని ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ