Hand Palmistry :పుట్టుమచ్చ బట్టి మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి
Hand Palmistry :జ్యోతిష్కులు పుట్టుమచ్చలను బట్టి, అరచేతి రేఖలను బట్టి జాతకం చెబుతుంటారు. శరీరంపై ఉండే పుట్టుమచ్చలు కూడా మన అదృష్టాన్ని నిర్ణయిస్తాంటారు జ్యోతిష్య పండితులు. దీనికి శాస్త్రీయత ఉందని కూడా వారి గట్టి విశ్వాసం. ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయో చూద్దాం
పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్న వారు ధనవంతులు అవుతారు, కీర్తిప్రతిష్టలు పొందుతారు
రెండు కనుబొమ్మల మధ్య పురుషులకు పుట్టుమచ్చలు ఉంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది.
తలలో పురుషులకు పుట్టుమచ్చలుంటే గర్వం ఎక్కువట. వారు ప్రతి అంశాన్ని విమర్శనాత్మకంగా పరిశీస్తారు, ఆశాభావంతో జీవిస్తారు. నుదుటి మీద ఉంటే మంచి కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతారు.
నుదుటి కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే మంచి లక్ష్యాన్ని ఎంచుకుంటారు. ఏకాగ్రతతో పనిచేస్తారు. 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు.
కనుబొమ్మపై ఉంటే కష్టపడి పని చేయాల్సి ఉంటుందట. కొంతమందికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి
నాసికపై పుట్టుమచ్చ ఉంటే కొంతమందిలో క్రమశిక్షణ లోపిస్తుంది.
చెవికి చెందిన ఏ భాగంలో ఉన్నా ధనం కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మంచి గుర్తింపు కూడా ఉంటుంది.
పెదవిపై ఉంటే కొన్ని మార్లు బంధువులు, స్నేహితుల మీద మీకు ఈర్ష్య కలుగుతుంది.
బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు సంపాదించుకుంటారు.
నాలుక మీద పుట్టుమచ్చ ఉంటే మంచి తెలివితేటల కలిగి ఉంటారు. విద్యార్జన చేస్తారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ