Kitchenvantalu

Cleaning Hack: మీ వంటింట్లో పెనం జిడ్డుగా మారిందా..? ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే చాలు..

Cleaning Hack: వంటగదిలో పెనంను ఎక్కువగానే వాడుతూ ఉంటాం. చాలా తొందరగా జిడ్డు పడుతూ ఉంటుంది. పెనం జిడ్డు వదిలించుకోవటం చాలా కష్టమైన పని. ఇప్పుడు చెప్పే చిట్కాలు ఫాలో అయితే చాలా సులభంగా తొలగించుకోవచ్చు.

మీ వంటింట్లో పెనం జిడ్డుగా మారిందా..? ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే చాలు.. టెన్షన్‌ ఫ్రీ.. మనం ప్రతి రోజు అంటే దాదాపుగా వారంలో రెండు నుంచి మూడుసార్లు అయినా పెనంను ఉపయోగిస్తూ ఉంటాం. పెనంను శుభ్రంగా క్లీన్ చేయకపోతే జిడ్డు పేరుకుపోయి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

చాలా మంది పెనంపై జిడ్డు వదిలించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

ఈ మధ్యకాలంలో నాన్ స్టిక్ పెనాలు వాడటం ఎక్కువ అయింది. అయితే మనలో చాలామంది నాన్ స్టిక్ పెనానికి బదులు ఇనుప పెనం వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యానికి ఇనుప పెనం మంచిదని ఒక భావన ఉంది. ఇనుప పెనం మీద పేరుకుపోయిన జిడ్డును తొలగించుకోవడానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

నిమ్మకాయ, ఉప్పు పెనం మీద జిడ్డును తొలగించడానికి చాలా బాగా సహాయపడతాయి. నిమ్మకాయను సగానికి కట్ చేసి ఉప్పులో ముంచి జిడ్డుగా మారిన పెనం మీద రుద్దాలి. ఈ విధంగా రుద్దిన తర్వాత ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని ఉపయోగించి స్క్రబ్బర్ తో పెనంను శుభ్రంగా కడగాలి.

అలాగే వెనిగర్ కూడా పెనం మీద జిడ్డును తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఒక గిన్నెలో నీరు, వెనిగర్ సమాన భాగాలుగా తీసుకుని బాగా కలిపి స్పాంజ్ సాయంతో పెనం మీద రుద్దాలి.

ఈ విధంగా రుద్దిన తర్వాత ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇప్పుడు చెప్పిన ఈ రెండు చిట్కాలు పెనం మీద జిడ్డును తొలగించడానికి చాలా బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ