Vankaya Nuvvula Kura:ఈ వంకాయ కర్రీ చూసిన వెంటనే మీరు వంకాయలు తెచ్చి చేస్తారు …
Vankaya Nuvvula Kura: వంకాయతో ఏ కూర చేసిన చాలా రుచిగా ఉంటుంది. మనలో చాలా మంది వంకాయను చాలా ఇష్టంగా తింటారు. వంకాయ కూరంటే నచ్చనివారు ఉండరు. వంకాయకు జోడిగా నువ్వులు కాని యాడ్ చేసారంటే, వంకాయ టేస్ట్ డబుల్ అయిపోతుంది.
కావాల్సిన పదార్ధాలు
నువ్వుల కారం కోసం..
నువ్వులు – 3 టేబుల్ స్పూన్స్
లవంగాలు – వెల్లుల్లి – 7
ఎండుమిర్చి – 10
వంకాయలు – 1/2kg
కూర కోసం..
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – ½ టేబుల్ స్పూన్
చింతపండు పులుసు – ½ కప్పు
కొత్తిమీర – కొద్దిగా
కారం – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, పాన్ లో, నువ్వులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, వేసి, నెమ్మదిగా వేపుకుని,మిక్సీలో కొద్దిగా వాటర్ వేసుకుని, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2.అదే పాన్ లో నూనె వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేపుకోవాలి.
3. వేగిన తాళింపులో, వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి, వేపుకోవాలి.
4.వేగిన వంకాయల్లో, నువ్వుల కారం పేస్ట్, కొద్దిగా నీళ్లు, చింతపుండు పులుసు పోసి, కారం యాడ్ చేసుకుని, నూనె పైకి తేలేవరకు, మీడియం ఫ్లేమ్ పై మూత పెట్టి ఉడికించుకోవాలి.
5. చివరగా కొత్తిమీర చల్లుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ