Chandrakantha :బంగారం కంటే విలువైన ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలద్దు …
Chandrakantha Benefits in telugu : చంద్ర కాంత పువ్వులు చాలా అందంగా ఉంటాయి. చంద్రకాంత యొక్క శాస్త్రీయ నామం మిరాబిలిస్ జలపా. ఈ పువ్వులు చాలా రంగులలో కనిపిస్తాయి . ఈ పూవులను “నాలుగు గంటల పువ్వు” అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పువ్వు సాధారణంగా సాయంత్రం నాలుగు గంటలకు వికసిస్తుంది. అందుకే నాలుగు గంటల పువ్వు అని పిలుస్తారు.
పగటి సమయంలో ముడుచుకొని ఉంటాయి. ఇవి చాలా సున్నితంగా, సువాసన భరితంగా ఉంటాయి. ఎండపొడ తగలగానే ఇట్టే వడలిపోతాయి. వీటిలో గింజలు రుద్రాక్షల్లాగా ఉంటాయి. అందుకనే కొందరు వీటిని రుద్రాక్ష పూలు అని కూడా పిలుస్తారు. ఈ పూలు ఒకే రంగులోనే కాకుండా
అనేక రంగుల్లో, ఒకటి, రెండు రంగులు కలగలిపీ పూస్తాయి.
ఈ మొక్కల్లో పువ్వు తప్ప మిగతా భాగమంతా ఔషధంగా పనిచేస్తుంది. దుంప, వేర్లు, ఆకులతో చేసిన మందులు మంచి ఫలితాలను ఇస్తాయని ఆయుర్వేదం చెపుతోంది. తామర, గజ్జి, మొటిమలు, దద్దుర్లు, మచ్చలకు పైపూతగా వాడతారు. వీటి ఆకుల్ని నూరి కట్టుకడితే సెగ్గడ్డల గాయాలు ఇట్టే పోతాయి. తియ్యటి వాసన వచ్చే ఈ పూల నుంచి సేకరించిన రంగును కేకులు, జెల్లీల తయారీలో వాడతారు.
బ్రెజిల్, భారతీయ వైద్యాల్లో ఎండబెట్టిన పువ్వుల పొడి తలనొప్పి, దద్దుర్లు వంటి వాటికి మంచి మందుగా చెబుతారు.ఈ పువ్వులను ఎక్కువగా ఆహారంలో రంగుగా ఉపయోగిస్తారు. కేకులు మరియు జెల్లీలలో రంగు కోసం ఈ పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
దీనిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండుట వలన మూత్రవిసర్జన, శుద్దీకరణ మరియు గాయాలను నయం చేసే ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. మూత్ర విసర్జనకు ప్రేరకంగా బాగా పనిచేస్తుంది. ఈ మొక్క ఆకులు గాయాలను నయం చేయటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మంట కూడా తగ్గుతుంది.
పువ్వు యొక్క ఉబ్బెత్తు మూలాలు భేదిమందు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. పౌడర్, కొన్ని రకాల విత్తనాలను సౌందర్య మరియు రంగులుగా ఉపయోగిస్తారు.ప్రతి పువ్వు నుండి ఒక విత్తనం వస్తుంది. ఇది గుండ్రంగా మిరియం గింజ వలె ఉంటుంది. ఈ విత్తనాలు విషపూరితంగా ఉంటాయి.ఈ ఆకుల పొడిని చర్మ వ్యాధుల ను తగ్గించటానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క వేరుతో తయారుచేసిన కషాయం ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది.
పువ్వుల నుండి సేకరించిన రసాన్ని రింగ్ వార్మ్ మరియు పుండ్లు నయం చేయటం కోసం ఉపయోగిస్తారు. ఈ మొక్క వేరు నుండి తీసిన రసంతో చెవి నొప్పి,విరేచనాలు, సిఫిలిస్ మరియు కాలేయ సంక్రమణకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.తేనెటీగ మరియు తేలు కుట్టినప్పుడు ఈ ఆకు రసాన్ని రాస్తే మంట నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ మొక్క యొక్క ఆకులు మరియు పువ్వులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
ఈ అకుల రసంతో మొటిమల చికిత్స, చెవి నొప్పులు, చర్మ వ్యాధులు, దురద , తామర, చర్మంపై హెర్పెస్ మచ్చలు, దీర్ఘకాలిక పుండ్లను తగ్గించటానికి ఉపయోగిస్తారు. చర్మపై ముడతలను తగ్గిస్తుంది. చంద్రకాంత పువ్వులను నీటిలో వేసుకొని స్నానము చేస్తే జలుబు, దగ్గు మరియు ఫ్లూ నుండి ఉపశమనం లభిస్తుంది.
తెల్లని పువ్వులు పూసే మొక్క ఆకులు సూక్ష్మజీవులతో పోరాడే సామర్థ్యాన్ని ఎక్కువ కలిగి ఉంటాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలోని ఆదివాసీ ప్రజలు రక్తస్రావం ఆపడానికి యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్న ఈ విత్తనాలను ఉపయోగిస్తారు. అయితే ఈ విత్తనాలు విషపూరితమైనవి.
కాబట్టి కాస్త జాగ్రత్తగాఉండాలి .
ఈ విత్తనాల నుండి సేకరించిన ప్రోటీన్ పదార్దాలు క్యాన్సర్‌ను నివారించడంలో మరియు సూక్ష్మజీవులను చంపడంలో ప్రభావవంతంగా ఉన్నాయని ఈ మధ్య జరిగిన పరిశోధనలో తేలింది. చైనా ప్రజలు యాంటి మలేరియల్, యాంటిడిప్రెసెంట్‌గా ఉపయోగిస్తున్నారు. దురదలు వచ్చినప్పుడు చంద్రకాంత ఆకులను పేస్ట్ గా చేసి రాస్తే ఉపశమనం కలుగుతుంది.
వేడి లేదా ఇతర కారణాల వల్ల కలిగే నీటి బొబ్బల పైన ఈ ఆకుల పేస్ట్ రాస్తే తగ్గుతుంది. చంద్రకాంత ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని వడకట్టి ఆ నీటితో పుండ్లు మరియు గాయాలను కడిగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ