Glowing Skin: ఈ సీజన్‌లో ఫేస్ క్రీమ్స్, లోషన్స్ కంటే ఇదే బెటర్.. ముఖం మెరిసిపోతుంది
Glowing Skin: ఈ సీజన్‌లో ఫేస్ క్రీమ్స్, లోషన్స్ కంటే ఇదే బెటర్.. ముఖం మెరిసిపోతుంది..అబ్బాయి లేదా అమ్మాయి ఎవరికైనా స్కిన్ గ్లోయింగ్‌గా ఉండాలి.ఎంత తెల్లగా ఉన్నా కూడా స్కిన్ గ్లోయింగ్‌గా లేకుంటే అందంగా కనిపించరు.స్కిన్‌ను మెరిసేలా చేసుకున్నప్పుడు మాత్రమే అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందంగా కనిపిస్తారు.అందుకే మెరిసే స్కిన్ కోసం వేల రూపాయలు ఖర్చు చేసి ఫేసియల్స్, ఫేస్ ప్యాక్ ఇంకా రకరకాల ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు.
ఫేస్ గ్లోయింగ్ కోసం ఇంట్లో కూడా ఎన్నో రకాల క్రీములు వాడుతూ ఉంటారు.ప్రతి రోజు రెండు మూడు రకాల క్రీములు వాడినా కూడా అప్పటి వరకే గ్లోయింగ్‌గా ఉండి ఆ తర్వాత మళ్లీ యదావిధిగా ఉంటుంది.
స్కిన్ గ్లోయింగ్ కోసం వాడే పద్దతుల వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు జరిగి మొహం మొత్తం చెడిపోయే అవకాశం కూడా ఉంది.లోషన్స్ మరియు క్రీముల్లో కెమికల్స్ ఉండటం వల్ల అవి మొహానికి పడకపోవడంతో ఎలర్జి వచ్చి మొహంపై మచ్చలు వచ్చే అవకాశం ఉంది.
అందుకే ఎక్కువగా ఫేస్‌పై ప్రయోగాలు చేయక పోవడం మంచిది.మరి ఫేస్ గ్లోయింగ్ తెచ్చుకునేది ఎలా అంటారా.చిన్న చిన్న చిట్కాలతో ఫేస్‌ను గ్లోయింగ్‌గా మార్చుకోవచ్చు.
నీటితో ఫేస్ ఎక్కువ గ్లోయింగ్‌గా మారుతుంది.ఎవరైతే నీరు తక్కువగా తాగుతారో వారి ఫేస్‌లో జీవం లేకుండా పాలిపోయినట్లుగా ఉంటుంది.ఎవరి స్కిన్ అయితే డ్రైగా ఉండి, గ్లో లేకుండా ఉంటుందో వారు తక్కువ నీరు తాగుతారని అర్థం.
స్కిన్ గ్లోయింగ్ కోసం రోజులో కనీసం మూడు నుండి అయిదు లీటర్ల మంచి నీటిని తాగాల్సి ఉంటుంది.ఎంత ఎక్కువ మంచి నీటిని తాగితే అంత మంచిది అని నిపుణులు అంటున్నారు.
మంచి నీటి తర్వాత ఫేస్ గ్లోయింగ్‌కు అత్యధికంగా ఉపయోగపడేది పచ్చి కూరగాయలు.విటమిన్ సి చర్మ సౌందర్యంకు చాలా కీలకంగా పని చేస్తాయి.ఉడకబెట్టని కూరగాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది.బీట్ రూట్, క్యారెట్, కీరా, దొండ ఇంకా కొన్ని పచ్చి దోసకాయలను తినడం వల్ల మంచి స్కిన్ గ్లోయింగ్ వస్తుంది.
పండ్లను కూడా అధికంగా తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరుగుతుంది.చర్మం అధిక కాంతివంతం అవ్వాలంటే ఎక్కువగా పండ్లను తినాలి.పండ్ల జ్యూస్‌లు తాగినా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.ఇక డ్రైఫ్రూట్స్ వల్ల కూడా చర్మం గ్లోయింగ్‌గా అవుతుంది.ప్రతి రోజు కూడా డ్రై ఫ్రూట్స్‌ను తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్ వల్ల కేవలం చర్మ గ్లోయింగ్‌గా మారడం మాత్రమే కాకుండా పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి.చర్మం అందంగా మార్చుకునేందుకు వెలకు వేలు ఖర్చు చేయకుండా ఇలా ఖర్చు లేని చిట్కాలు పాటించి అందంగా ఉండండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ