Healthhealth tips in telugu

Pain In Back Of Heel: ఒక్కసారి రాస్తే చాలు మడమ నొప్పి తగ్గి జీవితంలో అసలు ఉండదు

How to cure heel pain at home in Telugu : మడమనొప్పి ఆడవారిలో తరచూ చూస్తుంటాం. వయసు మీద పడుతున్నకొద్దీ ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. సరైన చెప్పులు ధరించని వారికైతే ఏ వయసులోనైనా తలెత్తొచ్చు.

ఊబకాయం, మధుమేహం గలవారికి దీని ముప్పు ఎక్కువ. ఇది క్రీడాకారులకూ.. ముఖ్యంగా పరుగెత్తేవారికి, పాదాలు నేలకు బలంగా తాకే ఆటలు ఆడేవారికీ రావొచ్చు. చెప్పులు వేసుకోకుండా గట్టి నేల మీద ఎక్కువగా నడిచేవారికి, గంటల తరబడి కదలకుండా నిల్చునేవారికీ మడమ నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ.

మడమ నొప్పి అనేది వచ్చిందంటే విపరీతమైన బాధ ఉంటుంది. మడమ నొప్పి ఉన్నప్పుడూ పనులు చేయటానికి కూడా చాలా బాధగా ఉంటుంది. ఈ నొప్పి అనేది ఒక పట్టానా తగ్గదు. మడమ నొప్పి అనేది గట్టి నేల మీద బలంగా పరుగెత్తటం, ఎక్కువసేపు నిలబడే ఉండటం.. ఏదైనా కారణం వలన కండరం మీద తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు వస్తుంది.

రాత్రి పడుకొని ఉదయం మంచం దిగుతూనే కాలు నేల మీద పెట్టాలంటే చాలామందికి నరకం కనిపిస్తుంటుంది. అంత బాధ ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వేసుకున్న ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అంతేకాక ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.

బంగాళాదుంప మడమ నొప్పిని తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే సైందవ లవణం కూడా నొప్పిని తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. బంగాళాదుంపను శుభ్రంగా కడిగి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. ఆతర్వాత సైందవ లవణం వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టి ఒక క్లాత్ చుట్టాలి. అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒక సారి,సాయంత్రం ఒకసారి చేస్తూ ఉంటే మడమ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా రెండు లేదా మూడు రోజులు చేస్తే మడమ నొప్పి క్రమంగా తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ