Healthhealth tips in telugu

Tea for Diabetes: షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలా? అయితే ఈ టీ ని ప్రతిరోజు తాగండి

Diabetes tea recipe : టీ, కాఫీలు ఏవి తాగినా అందులో చిటికెడు పంచదారో, బెల్లము వేసుకోవడం అలవాటు. అయితే డయాబెటిక్ పేషెంట్లు మాత్రం పంచదారను, బెల్లాన్ని తినడానికి చాలా భయపడుతూ ఉంటారు. దీనివల్ల టీ, కాఫీలు తాగలేరు. అయితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచే అద్భుతమైన టీలు ఉన్నాయి.

డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ నియంత్రణలో ఉంచే కొన్ని రకాల టీల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పే టీలలో మీకు ఏది లభ్యం అయితే ఆ టీని తీసుకోవచ్చు.
Green Tea Brain Health Benefits
గ్రీన్ టీని ప్రతి రోజు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. గ్రీన్ టీలో క్యాటెచిన్స్ ఉండుట వలన కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ, శోషణను తగ్గించడం ద్వారా ఇన్సులిన్ నిరోధకత ప్రభావాలను తగ్గించే ప్రయత్నం చేస్తాయి.
Mandara Tea Benefits In telugu
మందార టీలో పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్ ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. తాజా మందార పువ్వులు దొరికితే వాటితో తయారుచేసుకోవచ్చు…లేదంటే మందార పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. మందార టీ డయాబెటిస్ ని తగ్గించటమే కాకుండా అధిక బరువును కూడా తగ్గిస్తుంది.
black tea
బ్లాక్ టీ చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ మూలకాలను కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. రోజూ ఒక కప్పు బ్లాక్ టీ తాగే వారికి డయాబెటిస్ దరిచేరదు.
Dalchina chekka for weight loss
దాల్చిన చెక్కను దాదాపుగా ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న దాల్చినచెక్క డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం లేదా టీలో కలపడం ద్వారా చేస్తే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
ప్రధానంగా దాల్చినచెక్క రక్తంలో చక్కెరను అధికంగా విడుదల చేయడాన్ని నిరోధిస్తుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ