Bald Hair:బట్టతల వచ్చాక బాధపడే కంటే – ముందు నుంచే ఈ టిప్స్ పాటించండి
Battatala Home remedies In telugu :నడి వయసు రాకుండానే.. తలపై జుట్టు పలచపడిపోతోంది! పాతికేళ్లకే బట్టతల వచ్చేస్తోంది. దాంతో యువత మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి రాకూడదంటే.. ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఒత్తయిన పొడవైన జుట్టును కోరుకుంటారు దీనికోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జుట్టు రాలే సమస్య, చిన్న వయసులోనే బట్టతల రావడం, చిన్న వయసులో తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలను తొలగించడానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది
ఈ చిట్కా కోసం ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లి రసం అనేది జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసి వడగట్టాలి. ఉల్లి రసం ఎంత మోతాదులో వుంటుందో అంతే మోతాదులో ఆముదం నూనె కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి.
తలకు షవర్ క్యాప్ లేదా పాలిథిన్ కవర్ తో కవర్ చేయాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.
కొందరికి వంశపారంపర్యంగా బట్టతల వస్తుంది. మీ వంశంలో కూడా బట్టతల ఉంటే.. దాన్ని ఆపడం దాదాపుగా కష్టం. అయితే, అలాంటి వారు పైన చెప్పిన వాటితో పాటు ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా బట్టతలను కొంతమేర అడ్డుకోవచ్చంటున్నారు నిపుణులు.
జుట్టుపై ఎక్కువ ఒత్తిడిని కలిగించే హెయిర్‌స్టైల్స్ ఫాలో అవ్వడం మానుకోవాలి. తలకు రెగ్యులర్ మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల కూడా బట్టతల ఆలస్యం అవుతుందంటున్నారు.
మీ డైట్‌లో ప్రొటీన్ లోపించకుండా చూసుకోవాలి. నట్స్, చీజ్, చేపలు, గుడ్లు, మాంసం, చికెన్ వంటి ప్రొటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకునేలా చూసుకోవాలంటున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ