Beauty Tips

Face Glow Tips:బొప్పాయి మామిడి ఆకులతో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది

Face Glow Tips:బొప్పాయి మామిడి ఆకులతో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది.. బొప్పాయి చాలా మందికి ఈజీగానే దొరుకుతుంది. దీనిని తినడం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా చాలా మంచిది. మరీ ముఖ్యంగా చర్మ సమస్యల్ని దూరం చేయడంలో బొప్పాయి ముందుంటుంది. బొప్పాయిలో చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేసే గుణాలు ఉన్నాయి. దీనిని వాడడం వల్ల స్కిన్ బేబి స్కిన్‌‌లా కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.దీనికోసం ఏం చేయాలంటే..

ముఖ సంరక్షణలో పండ్లు,కూరగాయలు మాయ చేస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే వాటిలో ఉన్న పోషకాలు ముఖం మీద నల్లని మచ్చలను తొలగించి ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.

ముఖం అందంగా, తెల్లగా ఉండాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే చాలా. మంది మార్కెట్లో దొరికే ఖరీదైన స్కిన్ వైట్నింగ్ క్రీములను కూడా వాడుతూ ఉంటారు. వాటి. కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. .

అలా కాకుండా పైసా ఖర్చు లేకుండా మన ఇంటిలోనే ఉండే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు ఏమీ లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. ఒక చిన్న టమాటాను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని దానిలో టమాటా ముక్కలు, ఒక కప్పు బొప్పాయి ముక్కలు వేసి మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేయాలి. ఈ పేస్టుని ఒక బౌల్లోకి తీసుకొని ఒక స్పూను నిమ్మరసం, అర స్పూన్ పసుపు, రెండు స్పూన్ల ఆరంజ్ తొక్కల పొడి, ఒక స్పూన్ పెరుగు వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. కాస్త ఓపిక శ్రద్ధ పెడితే మన ఇంటిలోనే చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.

బొప్పాయి,టమోటాలో ఉన్న పోషకాలు మృత కణాలను తొలగించటమే కాకుండా నల్లని మచ్చలను తొలగించి చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది. ఈ ప్యాక్ లో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ ప్యాక్ ని ట్రై చేసి అందమైన తెల్లని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోండీ.

మామిడి ఆక్లు కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. మామిడి ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేసి దానిలో పెరుగు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ