యూరిక్ యాసిడ్ ఉన్నవారు తమలపాకు తీసుకుంటే….ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు…
Betel Leaf For Uric Acid : ఈ రోజుల్లో సమస్యలు చాలా సులభంగా వస్తున్నాయి. అయితే ఆ సమస్యలను తగ్గించుకోవటానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి సమస్యలలో యూరిక్ యాసిడ్ సమస్య ఒకటి. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు కీళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లు వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మందులను వాడాల్సిందే.
అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. తమలపాకు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాలలో ఒకటి. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.
ఇలా ఏర్పడిన యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటికి వెళ్తుంది. అయితే అలా విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలో ఉండిపోతుంది. .అవి స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్లు చుట్టూ ఉండే కణజాలంలో పేరుకు పోతుంది. అప్పుడు భరించలేని నొప్పులు వస్తాయి. ఈ సమస్యకు తమలపాకు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒక చిన్న తమలపాకు నమిలి మింగవచ్చు… లేదా రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో తమలపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. రాత్రంతా మూత పెట్టి అలా వదిలేయాలి. …
మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి.. లేదంటే ఉదయం సమయంలో ఒక తమలపాకును చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. ఈ విధానాల్లో ఏ విధానాన్ని ఫాలో అయిన మంచి ఫలితమే కలుగుతుంది తమలపాకులో దాదాపుగా 85 నుంచి 90 శాతం నీరు ఉంటుంది. తమలపాకులో నీరు ఎక్కువగాను క్యాలరీలు తక్కువగాను ఉంటాయి.
అలాగే ప్రోటీన్, అయోడిన్, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ బి వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ విధంగా తమలపాకు తీసుకోవడం వలన రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గడమే కాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ , రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
అలాగే కరివేపాకు కూడా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఉదయం 4 లేదా 5 కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి నోటిలో వేసుకొని నమిలి మింగితే సరిపోతుంది.
అంతేకాకుండా వాము కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పావు స్పూన్ వామును ప్రతి రోజు తీసుకుంటే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పావు స్పూన్ వామును నేరుగా తీసుకోవచ్చు.. లేదంటే నీటిలో వేసి నానబెట్టి తీసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.