Weight Loss:1 గ్లాసు శరీరంలో వేడి,శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, అధిక బరువును తగ్గిస్తుంది
Summer weight loss Drink : ఆరోగ్యకమైన విధానంలో బరువు తగ్గడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల డైట్‌లు, కఠోరమైన వ్యాయామాలు, వాకింగ్ లాంటివి చేస్తుంటారు.
వెయిట్ లాస్ అవ్వడానికి తినకుండా ఆకలితో అలమటించే వారిని కూడా మనం చూసుంటాం. కానీ ఏమాత్రం బరువు తగ్గరు. రోజువారీ అలవాట్లలో మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా దీనికి కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.
వేసవి కాలంలో విపరీతమైన వేడి కారణంగా నీరసం,అలసట వంటివి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే అధిక బరువు, శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించటానికి కూడా చాలా బాగా సహాయపడే డ్రింక్ తయారుచేసుకుందాం. నీరసం లేకుండా అధిక బరువు తగ్గటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఒక మిక్సీ జార్ లో సగం కీరా దోసను కట్ చేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేయాలి. ఆ తర్వాత అరకప్పు పెరుగు వేసి మరల మిక్సీ చేయాలి. దీనిని ఒక గ్లాస్ లో పోసి పావు స్పూన్ లో సగం black salt లేదా Himalayan pink salt, పావు స్పూన్ జీరా పొడి వేసి బాగా కలపాలి. ఈ డ్రింక్ ని ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు.
కీరదోసకాయలో 95శాతం నీరు ఉండటం వల్ల, వేడి వాతావరణంలో శరీరానికి తగినంత హైడ్రేషన్ ను అందిస్తుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. శరీరంలో వ్యర్ధాలు అన్నీ బయటకు పోతాయి. బరువు తగ్గాలని ప్రణాళిక ఉన్నవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
జీలకర్ర కూడా బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనం కాకుండా చేస్తుంది. ఈ వేసవిలో ప్రతి రోజు ఈ డ్రింక్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి అసలు మిస్ అవ్వకుండా తాగండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ