Mangoes: కెమికల్స్ తో పండించిన మామిడి పండ్లను గుర్తించండిలా..!
Mangoes:మామిడిపండు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి కెమికల్స్ వేసి పండించిన మామిడి పండ్లు వస్తున్నాయి. ఇవి అంతగా రుచి ఉండవు. అయితే మామిడిపండు కెమికల్ లేకుండా పండించినవి.. మనం తినాలంటే చాలా జాగ్రత్తగా మామిడి పండ్లను చూసుకోవాలి. కొన్ని చిట్కాల ద్వారా మామిడిపండు కెమికల్ వేసి పండించారో లేదో తెలుసుకోవచ్చు.
నాచురల్ గా పండించిన మామిడి పండ్లు అక్కడక్కడ ఆకుపచ్చ రంగు కనబడుతుంది. అదే ఆర్టిఫిషియల్ గా పండించిన మామిడి పండ్లు అన్ని ఒకే కలర్లో అంటే పసుపు రంగులో యూనిఫామ్ గా ఉంటాయి.
నాచురల్ గా పండించిన మామిడి పండ్లు తీయని వాసనతో ఉంటాయి. అదే కెమికల్ వేసి పండించిన మామిడి పండ్లు కొంచెం కెమికల్ వాసనతో డిఫరెంట్ గా వాసన వస్తుంది.
నాచురల్ గా పండించిన పండ్లు తియ్యగా ఉంటాయి. కెమికల్ వేసి పండించిన పండ్లు కొంచెం చప్పగా ఉంటాయి.
కెమికల్ వేసి పండించిన పండ్లు నాచురల్ గా పండించిన పండ్ల కంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి.
నాచురల్ గా పండించిన పండ్లు నీటిలో వేస్తే అవి మునుగుతాయి. అదే కెమికల్ తో పండించిన పండ్లు నీటిలో వేస్తే తేలుతాయి.
అంతేకాకుండా బేకింగ్ సోడా వేసిన నీటితో పండ్లను కడిగితే వాటి రంగు మారితే అవి కెమికల్ తో పండించిన మామిడి పండ్లను అర్థం చేసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ