Beauty Tips

White Hair:తెల్లజుట్టుతో తెగ విసిగిపోయారా.. ఈ నేచురల్ చిట్కాలు మీ కోసమే..

White Hair:తెల్లజుట్టుతో తెగ విసిగిపోయారా.. ఈ నేచురల్ చిట్కాలు మీ కోసమే.. ఒకప్పుడు వయసు పెరిగాక తెల్ల జుట్టు సమస్య వచ్చేది. కానీ ఇప్పటి రోజుల్లో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. ఇలా తెల్లజుట్టు చాలా చిన్నవయసులో రావడంతో చాలా కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ ఉంటున్నారు.

అలా చేయటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా తెల్ల జుట్టు వచ్చినప్పుడు ప్రారంభంలోనే గుర్తించి ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. తెల్ల జుట్టు రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి.

ఉసిరి
తెల్ల జుట్టును నల్లగా మార్చటానికి ఉసిరి చాలా బాగా సహాయపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేసి మరిగించి ఆ నూనెను వడగట్టి రోజు విడిచి రోజు తలకు పట్టిస్తే సరిపోతుంది. లేదంటే ఉసిరి పొడిలో నీటిని కలిపి పేస్టులా తయారుచేసి జుట్టుకు పట్టించి ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.

కరివేపాకు
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తిని పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కరివేపాకు వేసి బాగా మరిగించి ఆ నూనెను వడగట్టి నిలువ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు మనం తలకి నూనె ఎలా రాస్తాము… అదే విధంగా ఈ నూనెను కూడా రాస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

బ్లాక్ టీ
బ్లాక్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్, కెప్టెన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టును నల్లగా ఉండేలా చేస్తాయి. బ్లాక్ టీని జుట్టుకు పట్టించి ఒక గంట అయ్యాక తల స్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారిపోతుంది.

ఉల్లిపాయ
ఉల్లిపాయలో ఉత్ప్రేరక ఎంజైమ్స్ సమృద్ధిగా ఉండటం వలన ఆక్సికరణ ఒత్తిడి కారణంగా వచ్చే తెల్ల జుట్టును తగ్గిస్తుంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేస్తే సరిపోతుంది.

హెన్నా
హెన్నా పౌడర్ కూడా జుట్టుకు పట్టిస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ