Healthhealth tips in telugu

Yellow Teeth:పసుపు రంగు దంతాలను తెల్లగా మార్చే అద్భుతమైన చిట్కా

Yellow Teeth:పసుపు రంగు దంతాలను తెల్లగా మార్చే అద్భుతమైన చిట్కా.. ప్రతి ఒక్కరూ దంతాలు తెల్లగా మిలమిలా మెరవాలని కోరుకుంటారు. అయితే ఒక్కొక్కసారి దంతాలు పసుపు రంగులో మారుతూ ఉంటాయి.

అలాంటప్పుడు ఇప్పుడు చెప్పే ఈ ఇంటి చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక బౌల్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా, కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసి అవసరమైతే నీటిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్ తో దంతాలపై సున్నితంగా రుద్దాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే పసుపు రంగులో ఉన్న దంతాలు తెల్లగా మిలమిలా మెరుస్తాయి. ఈ చిట్కాలో ఉపయోగించిన బేకింగ్ సోడా దంతాలను తెల్లగా మార్చుతుంది. అలాగే నిమ్మరసం మరగలను తొలగించడంలో సహాయపడుతుంది.

అయితే ఈ చిట్కాను ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే దంతాల మీద ఎనామిల్ పోయే అవకాశం ఉంది. కాబట్టి వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఈ చిట్కాను ఫాలో అవ్వాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ