Gongura: గోంగూరతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..? ఈ సమస్యలన్నీ పరార్..!
Gongura benefits in telugu : ఆకు కూరలు మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. అలాంటి ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూరతో పచ్చడి, పప్పు, గోంగూర పులిహోరను, గోంగూర మటన్, గోంగూర చికెన్ వంటి చాలా రకాల వంటకాలు తయారు చేస్తారు.
ఇకపోతే, గొంగూరలో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి తెల్ల గోంగూర, రెండు ఎర్ర గోంగూరలు లభిస్తాయి. అయితే, ఏదైనా సరే.. తరచూ గోంగూర తింటే ఆరోగ్యానికి పుష్కలమైన ఉపయోగాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
గోంగూర అంటే తెలుగువారికి చాలా ఇష్టం. పచ్చడి చేసిన ఊరగాయ పెట్టిన పప్పు వేసిన ఎంతో ఇష్టంగా తింటారు. ఒకరకంగా చెప్పాలంటే గోంగూర అంటే ప్రాణం పెట్టేస్తారు. తెలుగునాట గోంగూరకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ఆంధ్రమాతగా ఆరాధిస్తారు. ఇష్టంగా భుజిస్తారు. పచ్చడి వేసుకున్నా.. పులుసుగా తిన్నా గోంగూర రుచి మరి దేనికి ఉండదంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే గోంగూరతో తెలుగువాడి జీవనం ముడిపడి పోయింది.అందరికి అందుబాటు ధరలో ఉండే పుల్లని రుచితో ఉండే గోంగూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోంగూరలో విటమిన్ సి, ఎ, బి6 తో పాటు ఐరన్,మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి.గోంగూరను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సీజన్ మారుతున్న సమయంలో దగ్గు,రొంప వంటివి వస్తూ ఉంటాయి.
అలంటి సమయంలో గోంగూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. గోంగూర సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారు విటమిన్ K పుష్కలంగా ఉన్న గోంగూర తింటే రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. రక్తహీనత సమస్య దూరం కావాలంటే విటమిన్ కే అవసరం.
గోంగూరలో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన తరచుగా గోంగూరను తీసుకుంటే కంటికి సంబందించిన సమస్యలు తొలగిపోవటమే కాకుండా కంటి చూపు మెరుగవుతుంది.గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉండుట వలన యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు సహాయపడుతుంది.
మధుమేహం ఉన్నవారికి గోంగూర చాలా మంచిది. గోంగూర రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్ లెవెల్స్ ని తగ్గించి మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అంతేకాక రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది. గోంగూరలో క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉండుట వలన రోజువారీ ఆహారంలో గోంగూరను భాగంగా చేసుకుంటే ఎముకలు బలంగా,ఆరోగ్యంగా,పటిష్టంగా ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ