Anjeer:అంజీర్ పండ్లను పరగడపున ఇలా తీసుకోండి.. అధికబరువు, షుగర్‌తో పాటు ఈ సమస్యలన్నీ పరార్..
Anjeer Health benefits in Telugu :అంజీర్ ఒక ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్. దీన్ని శీతాకాలంలో ఎక్కువగా తింటారు. దీని స్వభావం శరీరంలో వేడిని పుట్టిస్తుందని అంటారు.. అందుకే వేసవిలో దీనిని తినకూడదని చాలా మంది భావిస్తారు. కానీ, వేసవిలో అంజీర్ హ్యాపీగా తినొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అంజీర్… ఈ పండు గురించి మీరు వినే ఉంటారు. వీటిని తెలుగులో అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. బాగా పండిన ఈ పండ్లను ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అయితే ఈ పండ్లను ఎలా తిన్నా కూడా మనకు దాంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రధానంగా ఒక రెండు అంజీర్ పండ్లను నిత్యం భోజనానికి ముందు తింటే దాంతో ఎన్నో లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంజీర్ పండ్లను రెండు తీసుకొని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున నానిన అంజీర్ పండ్లను తింటూ ఆ నీటిని తాగాలి.
ఈ విధంగా తీసుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా తినటం కష్టంగా ఉంటే నానిన అంజీర్ ని మెత్తని పేస్ట్ గా చేసుకొని తినవచ్చు. ఏదైనా డ్రై ఫ్రూట్ నానితే దానిలో ఉన్న పోషకాలు అన్నీ మన శరీరానికి అందుతాయి. అంజీర్ పండ్లలో ఫైబర్ కావల్సినంత ఉంటుంది. దీంతో ఇది మనం తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది.
జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యలన్నీ దూరమవుతాయి. అంజీర్‌లో పొటాషియం, సోడియం బాగా లభిస్తాయి. ఇవి రక్తపోటు (బీపీ) సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. రక్తహీనత సమస్య నేడు చాలా మందిని బాధిస్తోంది.
అయితే అలాంటి వారు నిత్యం రెండు అంజీర్ పండ్లను భోజనానికి ముందు తిన్నట్టయితే వారిలో రక్తం బాగా పడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి విష జ్వరాల బారిన పడి ప్లేట్‌లెట్లు తగ్గిన వారికి ఈ పండ్లను తినిపిస్తే వెంటనే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.
అధిక బరువు సమస్య కూడా ఇప్పుడు అధికమైంది. ఈ క్రమంలో అంజీర్ పండ్లను రెండు పూటలా భోజనానికి ముందు తింటే దాంతో పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఎక్కువగా ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు. అంతేకాదు అంజీర్‌లో ఉండే పోషకాలు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి.
నిత్యం అంజీర్ పండ్లను తింటుంటే గుండె సంబంధ సమస్యలు కూడా దూరమవుతాయి. అంజీర్ పండ్లలో ఉండే పెక్టిన్ అనే పదార్థం శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంజీర్ పండ్లలో మెగ్నిషియం, మాంగనీస్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి సంతానం కావాలనుకునే వారికి మేలు చేస్తాయి.
శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు నాశనమవుతాయి. అంజీర్ పండ్లు మధుమేహం ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. భోజనానికి ముందు వీటిని తింటే అనంతరం రక్తంలో షుగర్ స్థాయిలు అంతగా పెరగవు. ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అంజీర్ పండ్లను తింటే ఆ అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అంజీర్ పండ్లలో కాల్షియం కూడా పుష్కలంగానే ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢమవుతాయి. ఎముకలు విరిగి ఉన్న వారికి వీటిని పెడితే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. కాబట్టి రోజుకి రెండు అంజీర్ పండ్లను తిని ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ