Face Glow Tips:ఎన్నో ఏళ్లుగా ఉన్న పిగ్మెంటేషన్ ఈ చిన్న చిట్కాతో మాయం అవ్వటం ఖాయం
Face Glow Tips:ముఖం అందంగా ఉండాలని మనలో చాలా మంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలాగే సమయం కూడా వృధా అయిపోతూ ఉంటుంది.
అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో మన వంటింట్లో ఉన్న కొన్ని పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా ముఖం మీద నల్లని మచ్చలు, ఫిగ్మెంటేషన్ లేకుండా చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా చేసుకోవచ్చు. దీనికోసం మనం ఈరోజు రెండు చిట్కాలను తెలుసుకుందాం.
మొదటి చిట్కా విషయానికి వచ్చేసరికి.. ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి, పావు స్పూన్ లో సగం పసుపు, ఒక స్పూన్ పెరుగు, రెండు స్పూన్ల టమాటా రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటిని ముఖం మీద జల్లుతూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మొఖం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది.
ఇక రెండో చిట్కా విషయానికి వచ్చేసరికి ఒక బౌల్లో ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ తీసుకొని వెయ్యాలి. ఆ తర్వాత అర స్పూన్ తేనె, పావు స్పూన్ లో సగం పసుపు, ఒక స్పూన్ రోజు వాటర్ వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు, ముడతలు, పిగ్మెంటేషన్ అన్ని తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన రెండు చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ