Seeds:బాదం, జీడి పప్పుల కంటే అత్యంత బలాన్ని ఇచ్చే ఖర్చు లేని పప్పులు ఇవే
Dry Seeds : ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇటీవల ఆరోగ్యం పైన చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది తెలుసుకొని మరీ జాగ్రత్త పడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు, శరీరానికి అన్ని పోషకాలు అందాలని భావించేవారు కొన్ని రకాల గింజలను తింటే ప్రయోజనం ఉంటుందని గుర్తించారు
డ్రై ఫ్రూట్స్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బాదం పప్పు, జీడిపప్పులు వంటివి చాలా ఖరీదైనవి. వాటికి బదులుగా అత్యంత బలాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. వాటిలో కూడా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ రోజు అటువంటి మూడు పప్పుల గురించి తెలుసుకుందాం.
పుచ్చపప్పులను తింటే రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కండరాలు దృఢంగా మారి ఏదైనా పని చేసేప్పుడు అలసట,నీరసం తగ్గుతుంది. మెదడు పని తీరు మెరుగుపడి వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు తగ్గుతాయి. కంటికి సంబందించిన సమస్యలు ఉండవు.
సన్ ఫ్లవర్ సీడ్స్ తింటే కీళ్లనొప్పులు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరానికి అవసరమైన కీలక పోషకాలను అందించడంతో పాటు శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కరిగిస్తుంది.విటమిన్ ఇ సమృద్దిగా ఉంటుంది. హైబీపీని నియంత్రణలో ఉంచడం అలానే మన శరీరంలోని రక్త సరఫరాని మెరుగు పరుస్తుంది.
గుమ్మడికాయ గింజలు యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన బరువును, కాలేయంలో కొలెస్ట్రాల్ నిక్షేపాలను నిరోధించగలవు. జింక్ సమృద్దిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. వీటిలో విటమిన్ ఏ, సీ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. కొల్లాజెన్ గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు ఈ మూడు పప్పులను ఒక స్పూన్ చొప్పున తింటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ