Kitchen

దసరా స్పెషల్ అటుకుల లడ్డు

శ్రీకృష్ణుడికి అటుకులు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆ అటుకులతో లడ్డు తయారి విధానాన్ని తెలుసుకుందాం. లడ్డు తయారీకి కావలసిన పదార్ధాలు మరియు తయారీ విధానంను వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
అటుకులు – 2 కప్పులు
ఎండు కొబ్బరి ముక్కలు – అర కప్పు
గుల్ల శనగపప్పు – అర కప్పు
మెత్తని పొడి బెల్లం – 1 కప్పు
పాలు – తగినన్ని.(వేడి)

తయారుచేసే విధానం:
అటుకుల్ని, ఎండు కొబ్బరిని, గుల్ల శనగపప్పును విడి విడిగా గ్రైండర్‌లో మెత్తగా పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ పొడులన్నీ ఒక ప్లేటులో బెల్లం పొడితో పాటు బాగా కలిసేలా కలపాలి. ఈ పొడిలో కొంచెం కొంచెం వేడి పాలను కలుపుతూ లడ్డు వలె తయారుచేయాలి. ఈ అటుకుల లడ్డు అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ లడ్డులను ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి.