Devotional

కృష్ణాష్టమి పండుగను సెప్టెంబర్ 2 లేదా 3 ఏ రోజు ఏ సమయంలో చేయాలో తెలుసుకోండి

ఈ సంవత్సరం అష్టమి తిధి సెప్టెంబర్ 2 వ తారీఖు రాత్రి 8.47 గంటలకు మొదలై సెప్టెంబర్ 3 వ తారీఖు రాత్రి 7. 19 నిమిషాలకు ముగుస్తుంది. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించారు కాబట్టి సెప్టెంబర్ 3 తారీఖు అర్ధరాత్రి అష్టమి తిధి లేదు. కాబట్టి స్మార్త సంప్రదాయం ఉన్నవారు సెప్టెంబర్ 2 వ తారీఖు రాత్రి 11.52 గంటల నుండి 12. 39 నిమిషాల పూజ చేస్తారు. ఏకాదశికి ఎలా ఉపవాసం ఉంటారో అలాగే అష్టమి తిధి ఉన్నంతసేపు ఉపవాసం ఉంటారు. 3 తారీఖు రాత్రి 7. 19 నిమిషాలకు ముగిస్తుంది. రోహిణి నక్షత్రం 8 గంటల 5 నిమిషాలకు ముగుస్తుంది. సెప్టెంబర్ 2 వ తారీఖున సూర్యోదయం సమయంలో అష్టమి తిధి లేదు కనుక వైష్ణవ సంప్రదాయం కలవారు సెప్టెంబర్ 3 వ తేదీన కృష్ణాష్టమి జరుపుకుంటారు.

ఈ రోజు ఉదయాన్నే శ్రీకృషుడు ని షోడచోప చారాలతో పూజించి ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 4 వ తేదీన సూర్యోదయం అయ్యాక 6 గంటల 6 నిమిషాలకు ఉపవాస దీక్ష ముగించి ఆహారం తీసుకోవచ్చు. ఉపవాసం ఉండలేని వారు సెప్టెంబర్ 3 వ తారీఖున శ్రీకృషుడు ని షోడచోప చారాలతో పూజించి శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.