కేసీఆర్ తిరుగులేని నేత ఎలా అయ్యారో తెలుసా ? ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపు మేరకు టిడిపిలో చేరి ఓ వెలుగు వెలిగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే చాలామందికి తెల్సిన పేరే. ఇంకా చెప్పాలంటే,షార్ట్ కట్ లో కేసీఆర్ అంటే అసలు తెలియని వారుండరు. అంతగా పాపులారిటీ గల పొలిటీషియన్ ఈయన. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మొదలుపెట్టి ,చివరకు అన్ని పార్టీలను తన ఉద్యమంతో తెలంగాణకు జై కొట్టేలా చేసిన ఘనుడు. తెలంగాణా సాధించి, ఒంటరిగా ఎన్నికల బరిలో నిల్చిన కేసీఆర్ అనూహ్యంగా సీఎం అయ్యారు. అతని శక్తియుక్తులు అలాంటివి మరి. ఇక ఆయనకు కొడుకు కేటీఆర్,మేనల్లుడు హరీష్ రావు,కూతురు కవిత ఎసెట్స్ అని చెప్పాలి.
మాటలను మంత్రాలుగా చేయడంలోనే కాదు,చేసింది చిన్నదైనా,భారీ ప్రచారం చేసుకోవడంలో దిట్ట. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటివి అలాంటివే. బక్క బలచ గా వుండే కేసీఆర్ ఇంతటి శక్తిమంతుడుగా మారి దక్షిణాదిన అన్నిపార్టీలు ఏకం చేయడంలో కీలక భూమిక వచించడమే కాదు,ఏపీలో కూడా పార్టీని విస్తరించేలా పావులు కదపడం మామూలు విషయం కాదు. ఒక్క కలం పోటుతో అసెంబ్లీని రద్దుచేసి, ముందస్తు ఎన్నికలకు తెరలేపారు.
దీంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రతిపక్షాలను తిట్టినా, పొగిడినా, ప్రెస్ రిపోర్ట్రర్స్ తో ఆడుకున్నా,యాదగిరి గుట్టకు వెళ్లి మొక్కినా, ఢిల్లీ వెళ్లి ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాళ్లపై పడినా,ప్రధాని మోడీని కల్సి పొగిడేసి, బయటకు వచ్చాక తిట్ల దండకం అందుకున్నా, రాహుల్ గాంధీని బఫున్, బచ్చా అనేసినా, కాంగ్రెస్ నేతలను ఉతికి ఆరేసినా,చంద్రబాబుని అనరాని మాటలు అన్నా, ఏదైనా కేసీఆర్ కి చెల్లింది.నిత్యం ప్రగతి భవన్ లో ఉంటూ తెలంగాణాలో మారుమూల కూడా ఏమి జరుగుతోందో ప్రతిగంటకూ నివేదిక రప్పించుకుంటారు.
తేడాలుంటే సరిచేసేస్తారు. రాష్ట్రంలో పార్టీ పట్ల ప్రజల వైఖరి ని ఎప్పటికప్పడు తెలుసుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సీనియర్స్ అందరితో చర్చి నిర్ణయం తీసుకోవడంతో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ తెచ్చింది, రప్పించింది తామేఅంటూ కొత్తపల్లవి కూడా అందుకున్నారు. యాదగిరి గుట్టును మరో తిరుపతిగా మార్చబోతున్నారు.
ఈ విషయంలో విమర్శలు వచ్చినా పట్టించుకోవడం లేదు. భాషమీద పట్టుగల కేసీఆర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో నేతగా ఎదిగి ఏకంగా ప్రధాని పీఠం అందుకోవాలని కూడా ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే పలు రాష్ట్రాల్లో తిరుగుతూ ఆయా పక్షాలను ఏకం చేస్తున్నారు. సంఖ్యాశాస్త్రం,జోతిష్యం నమ్మే కేసీఆర్ అన్నీ ఆప్రకారమే చేస్తారని చెబుతుంటారు.
ఆరు ఆయన లక్కీ నంబర్, చివరకు అసెంబ్లీ రద్దు కూడా దానిప్రకారమే చేసారని అంటారు. ఎవరెన్ని అనుకున్నా తాను అనుకున్నది చేయడంతో కేసీఆర్ ని మించిన వ్యక్తి లేరు. హైదరాబాద్ సీఎం కేటీఆర్ , రూరల్ సీఎం హరీష్ రావు అంటూ విమర్శలు వచ్చినా సరే, తన వ్యూహం ముందు అలాంటి మాటలు దిగదుడుపే. అందుకే దటీజ్ కేసీఆర్ అంటారు అందరూ.