ఈ స్టార్ హీరోయిన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కోడలు… ఆ డైరెక్టర్ ఎవరో చూడండి
చిత్ర పరిశ్రమ చిత్రంగానే ఉంటుంది. ఎన్నో చిత్ర విచిత్రాల సంగమంలా సాగిపోతోంది. అయితే హీరోలు ఎంత వయస్సు వచ్చినా సరే,హీరోలుగా రాణిస్తుంటే, హీరోయిన్స్ మాత్రం అలా కాదు. వాళ్ళ అందం తరిగినా, వయస్సు పెరిగినా,ఇక తల్లి , అక్క ,ఆంటీ పాత్రలతో సరిపెట్టుకోవాల్సిందేనని చెప్పాలి. గతంలో హీరోహీరోయిన్స్ జంట పాతిక ముప్పై సినిమాల్లో నటించిన సందర్భాలు ఉండేవి. హిట్ జంటగా పేరు తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు నాలుగదు సినిమాలు అయితే చాలు హీరోయిన్ ని పక్కన పెట్టేయాల్సిందే అన్నట్టుగా మారిపోయింది వ్యవహారం.
ఇక అసలు విషయానికి వస్తే, బేబీ డాలీ పేరుతొ బాలనటిగా చిత్ర రంగంలోకి వచ్చి, పెద్దయ్యాక ఆనాటి స్టార్ హీరోలందరితో కల్సి నటించిన స్టార్ హీరోయిన్ ఇప్పుడు తెలుగులో కనిపించడం లేదు. తమిళ సీరియల్స్ లో మాత్రం దూసుకుపోతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే,సులక్షణ. కళాతపస్వి కె విశ్వనాధ్ సినిమాలో ‘కంచికి పోతావా కృష్ణమ్మ’పాటతో గుర్తింపు పొందిన హీరోయిన్ సులక్షణ తెలుగు, తమిళ కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోస్ కల్సి నటించి, రాణించింది.
నిజానికి ఈమె అసలు పేరు శ్రీదేవి. అయితే అప్పటికే సినీ రంగంలో శ్రీదేవి బాగా పాపులర్ అవుతున్న నేపథ్యంలో సులక్షణగా పేరుమార్చుకుంది. మూడేళ్ళ ప్రాయంలో బాలనటిగా బేబీ డాలి పేరుతొ ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగు,తమిళ భాషల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.కృష్ణ,శోభన్ బాబు, చంద్రమోహన్ వంటి హీరోలతో కల్సి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సులక్షణ పెద్దయ్యాక అదే చంద్రమోహన్ సరసన హీరోయిన్ గా వేసింది. అదే శుభోదయం మూవీ. కె విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఆ మూవీలో కంచికి పోతావా కృష్ణమ్మా పాటతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది.
ఆ సినిమా హిట్ తో ప్రేమ నక్షత్రం,మా ఇంటి కథ,మా ఇంటి ప్రేమాయణం,న్యాయవాది వంటి సినిమాల్లో నటించిన సులక్షణ తెలుగు అమ్మాయి అయినా తమిళ, కన్నడ,మళయాళ భాషల్లో కూడా రాణించింది. ఇక తమిళంలో అయితే బిజీ ఆర్టిస్ట్ అనిపించుకుంది. హీరోయిన్ గా బిజీగా ఉన్నసమయంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎస్ విశ్వనాథన్ రెండో కొడుకు గోపి కిషన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే పెళ్లయ్యాక సినీ రంగానికి దూరమైంది.
ఈమెకు ముగ్గురు పిల్లలు పుట్టాక మనస్పర్థలు కారణంగా భార్య భర్తలు విడిపోయారు. భర్తనుంచి విడాకులు పొందిన సులక్షణ తెలుగు ఇండస్ట్రీకి శాశ్వతంగా దూరమైంది. తమిళంలో తల్లి పాత్రలతో ఆకట్టుకుంటూ,ఇటీవల కాలంలో తమిళ సీరియల్స్ లో తల్లి పాత్రలతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయి,సక్సెస్ ఫుల్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్న ఈమె మళ్ళీ తెలుగు లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.