Movies

కమెడియన్ గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సునీల్… కండిషన్స్ పెటుతున్నాడట… పూర్వ వైభవం సాధ్యమేనా?

కమెడియన్ గా వెండితెరపై తనదైన ముద్రను వేసిన నటుడు సునీల్. అందాలరాముడు సినిమాతో హీరోగా మారి కమెడియన్ కి గుడ్ బై చెప్పేసి హీరోగా చాలా సినిమాలు చేసాడు. అవి సక్సెస్ అవ్వటంతో హీరోగానే కంటిన్యూ అయ్యాడు. అయితే ఈ మధ్య సునీల్ సినిమాలు ఏమి ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దాంతో ఆలోచనలో పడ్డాడు సునీల్. ఇక హీరోకు గుడ్ బై చెప్పేసి మరల కమెడియన్ గా మారాలని నిర్ణయం తీసుకున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కమెడియన్ గా నటిస్తున్నాడు. అంటే కమెడియన్ గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినట్టు అనుకోవాలి.

సునీల్ సినిమాల్లోకి రాకముందు త్రివిక్రమ్,సునీల్ మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే రూమ్ లో ఉంటూ అవకాశాల కోసం దర్శకుల చుట్టూ తిరిగారు. త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్ నటించి తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ప్రస్తుతం కమెడియన్ గా సినిమాలు చేయటానికి రెడీ అయినా సునీల్ కొన్ని కండిషన్స్ పెడుతున్నాడట. మరి సునీల్ కండిషన్స్ పెడితే కమెడియన్ గా పూర్వ వైభవాన్ని పొందటం సాధ్యమేనా? ప్రస్తుతం జబర్దస్త్ వంటి షో లలో దుమ్ము రేపుతున్న కమెడియన్స్ ని తట్టుకొని నిలబడటం సాధ్యమేనా?