Devotional

Navaratri 2024:నవరాత్రులు చేయటం వీలు కావటం లేదా… అయితే ఈ ఒక్కరోజు ఇలా చేస్తే..

Navaratri 2024:నవరాత్రులు చేయటం వీలు కావటం లేదా… అయితే ఈ ఒక్కరోజు ఇలా చేస్తే.. దసరా శరన్నవరాత్రులు ప్రారభం అయ్యాయి. అయితే కొంత మందికి దసరా శరన్నవరాత్రులు చేయటం వీలు కాదు. అలాంటి వారు ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది.

దసరా శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని నియమ నిష్టలతో పూజిస్తే సకల శుభాలు కలగటమే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అయితే అందరికి తొమ్మిది రోజులు పూజ చేయటం కుదరదు. అలాంటి వారు ఏమి చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరస్వతి పూజ అక్టోబర్ 10 న వచ్చింది.

మూల నక్షత్రం రోజు అంటే సరస్వతి పూజ చేసే సప్తమి నాటి నుండి మూడు రోజులు పూజ చేస్తే నవరాత్రులు చేసిన పుణ్యం దక్కుతుంది. సరస్వతి పూజ,ఆయుధ పూజ,విజయదశమి రోజుల్లో పూజ చేయటం ద్వారా అనుకున్న పనులు నెరవేరతాయి. చదువుల తల్లి అయినా సరస్వతి పూజ రోజు సరస్వతి దేవి ముందు పుస్తకాలు,మన వృత్తిలో ఉపయోగించే వస్తువులను పెట్టి పూజ చేయటం వలన లాభం చేకూరుతుంది.

ఇలా సరస్వతి దేవిని పూజించటం ద్వారా పిల్లలకు జ్ఞానం, వ్యాపారం చేసేవారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. సరస్వతి దేవిని పూజించేటప్పుడు పండ్లు, శనగలను నైవేద్యంగా పెట్టాలి. ఇలా అమ్మవారికి శనగలను నైవేద్యంగా పెట్టటం ద్వారా నవగ్రహాలను సంతృప్తి పరిచినట్టు అవుతుంది. దాంతో నవగ్రహాల దోషాలు అన్ని తొలగిపోతాయి. నవరాత్రులు చేసేవారు తొమ్మిది రోజులు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి ముగ్గురు అమ్మలను పూజిస్తే దోషాలు అన్ని తొలగిపోయి ఇంటిలో సుఖ శాంతులు కలగటమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ