Movies

మెగా కోడలు ఉపాసన పర్సనల్ ప్రొఫైల్ చూస్తే షాకవుతారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని పెళ్లాడిన ఉపాసన 1989జులై 20న శోభన కామినేని,అనిల్ కామినేని దంపతులకు జన్మించింది. తాత అపోలో గ్రూప్స్ అధినేత ప్రతాప్ సి రెడ్డి. లండన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఈమె అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ సంస్థలకు సారధ్యం వహించి, ఆమె నేతృత్వంలో కొన్ని మ్యాగజైన్స్ కూడా ప్రచురితం చేసారు. ఇక ఆమెకు డాన్స్, సంగీతం చెప్పలేనంత ఇష్టం. హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ అప్పుడప్పుడు కలుస్తూ వుంటారు. అందుకే ముందు నుంచీ చిరు కుటుంబంతో ఉపాసనకు పరిచయం ఉంది.

ఆ విధంగా చెర్రీ , ఉపాసనల నడుమ ఫ్రెండ్ షిప్ పెరిగింది. పెళ్లి పీటలదాకా వచ్చి ఒకటయ్యారు. అయితే ఓసారి బర్త్ డే సందర్బంగా ఉపాసనకు ముందుగా చెర్రీయే ప్రపోజ్ చేసాడని అంటారు. అయితే ఆమె కూడా సానుకూలంగా స్పందించడంతో 2011డిసెంబర్ లో వీళ్ళ నిశ్చితార్ధం జరిగింది. పెళ్లి ముందు బాగా బొద్దుగా ఉండడంతో అప్పట్లో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. విపరీతమైన కామెంట్స్ తో జనాలు,ఫాన్స్ కూడా రెచ్చిపోయినా, ఆమె మాత్రం అసలు పట్టించుకోకుండా తనదైన శైలి లో వర్కవుట్ చేస్తూ, మెరుపు తీగలా మారిపోయింది.

ఎవరూ ఊహించనంత బ్యూటిఫుల్ గా మారిపోయిన ఉపాసన మొదట్లో పబ్లిక్ లో కొంచెం దూరంగా మసిలినప్పటికీ,నెమ్మదిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టి ఫిట్ నెస్ సీక్రెట్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల హోప్స్ ఇండియా పబ్లిష్ చేసిన టైకూన్స్ ఆఫ్ టుమారో లో స్థానం దక్కించుకున్నారు.

ఫిట్ నెస్ న్యూట్రిషన్ వంటి వ్యాపారాలను అపోలో గ్రూప్ లో ప్రారంభించి సక్సెస్ రేటుని చూపిస్తున్నారు. ఫాన్స్ కి ఇబ్బంది పెట్టేలా డ్రెస్ లు వేయకుండా,సెలబ్రిటీ భార్యగా ఫాన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు ఉపాసన. బ్రేక్ ఫాస్ట్ కి ఎక్కువ సమయం గడపడం అంటే ఉపాసనకు ఇష్టమట. ఆసమయంలో ముందు రోజు కబుర్లను, ఫ్యూచర్ డేస్ ప్లాన్స్ షేర్ చేసుకుంటారట. త్వరలో వారి ఫ్యామిలీలోకి కొత్తగా ఓ మెంబర్ ని కూడా తీసుకురాబోతున్నారట.

ఉపాసన ఆస్తులు పరిశీలిస్తే,అపోలో గ్రూప్స్ లో 0.16శాతం వాటా వుంది. దానివిలువ పాతిక కోట్ల రూపాయల వరకూ ఉంటుందట. ఇక కొత్తగా ఈమె ప్రారంభించిన వ్యాపారాల విలువ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక తల్లి దండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు కూడా లెక్కేస్తే ఆమె 3 అంకెల ఆస్తి మార్క్ దాటేశారని అంటున్నారు. ఇక కోడలిగా మెగా ఫ్యామిలిలో బాగా కల్సిపోయిందట.