Movies

సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్న మన స్టార్ హీరోస్

అదృష్టవంతుడిని పాడుచేయలేం,దురదృష్టవంతుడిని బాగుచేయలేం అంటారు కదా. కొన్ని సినిమాల విషయంలో అక్షరాలా అదే జరిగింది. ఒకరు చేయాల్సిన సినిమా మరొకరికి దక్కడం , అలా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకోవడం, వదిలేసుకున్నవాళ్ళు అది తలచుకున్నప్పుడల్లా బాధ పడడం జరుగుతున్నాయి. అలాంటి కొన్ని ఘటనలను చూద్దాం. తెలుగులో అమాయకపు పాత్రలో నటించిన విక్టరీ వెంకటేష్ మూవీ ‘చంటి’ చిత్రం సూపర్ డూపర్ హిట్. ఇది తమిళ సినిమాకు రీమేక్. తమిళంలో ఈ సినిమాలో హీరోయిన్ గా కుష్బూ నటనకు ఎనలేని కీర్తి వచ్చింది. చివరకు ఆమెకు గుడి కట్టేదాకా వెళ్ళింది.

నిజానికి ఈ సినిమాను రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకు ఎక్కించాలని భావిస్తున్న తరుణంలో వెంకటేష్ తో స్టార్ట్ చేసేసారు. హీరోయిన్ గా మీనా వేసింది. వెంకటేష్ కెరీర్ ని మార్చేసిన ఈ సినిమా మీనాకు కూడా మంచి పేరు తెచ్చిపెటింది. ఇప్పటికీ రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా మిస్ ఐన విషయం తలచుకుని తెగ బాధ పడిపోతుంటాడు. అలాగే జెంటిల్ మెన్ మూవీ డైరెక్టర్ శంకర్ కి మొట్టమొదటి సినిమా.

నిజానికి ఆ సినిమాలో హీరోగా అర్జున్ బదులు డాక్టర్ రాజశేఖర్ ని అనుకున్నారు. కానీ బిజీ కారణంగా డేట్స్ ఇవ్వకపోవడంతో అర్జున్ ని పెట్టి తీశారు. సూపర్ హిట్ అయింది. ఆతర్వాత డాక్టర్ రాజశేఖర్ చాలా ఫీలయ్యాడట. అంతేకాదు,మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో టాప్ మోస్ట్ మూవీగా నిల్చిన ఠాగూర్ కూడా డాక్టర్ రాజశేఖర్ చేయాల్సిందే. అయితే ఎక్కడో తేడా కొట్టడంతో చిరంజీవి,రాజశేఖర్ ల మధ్య గొడవకు దారితీసింది కూడా.

ఈ సినిమాను వివి వినాయక్ డైరెక్ట్ చేసాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కేరీర్ మొదట్లో వచ్చిన సింహాద్రి మూవీ కూడా బాలకృష్ణ కోసం విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తే,ఎందుకో ఒప్పుకోలేదట. దాంతో కొంచెం మార్పులు చేసి, ఎన్టీఆర్ తో తీస్తే,బ్లాక్ బస్టర్ అయింది. ఇలా చెప్పుకుంటూ పొతే తాజాగా అర్జున్ రెడ్డి సినిమా మొదట్లో బన్నీతో అనుకున్నారట.

ఒప్పుకోకపోవడంతో శర్వానంద్ దగ్గరకు వెళ్ళింది. అయితే అందులో బోల్డ్ నెస్ ఉండడంతో అతనూ ఒప్పుకోలేదు. అయితే అదే సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. డైరెక్టర్ సందీప్ కి ఎనలేని కీర్తి తెచ్చింది. అందండీ, దేనికైనా అదృష్టం ఉండాలి మరి.