Movies

హీరోయిన్,MLA రోజా జీవితంలో జరిగిన ఈ సంఘటనలు గురించి మీకు తెలుసా?

హీరోయిన్ రోజా అటు సినిమాల్లో ఎన్నో గ్లామరస్ పాత్రలు పోషించింది..ఇటు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందింది. పలు హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రోజా,శాసనసభ్యురాలు అయ్యాక కూడా ఆయా టీవీ చానల్స్‌లో వచ్చే గేమ్, కామెడీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. రోజా కూతురు అను మల్లిక సినీరంగ ప్రవేశం చేయనున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి..వాటికి తగ్గట్టుగానే రోజా కూతురు కూడా చాలా అందంగా ఉంది.

రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి..నాన్న నాగరాజా రెడ్డి సారధి స్టూడియోస్ లో పనిచేసేవారు..కాలేజ్ గ్రూప్ ఫొటో చూసి రోజా మొదటి సినిమా డైరెక్టర్ రోజాని ఎంపిక చేసారు..ఆ సినిమానే ప్రేమ తపస్సు..డైరెక్టర్ రోజా ఫాదర్ అంతకుముందే ఫ్రెండ్స్..నాన్నకూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రోజా సినిమా ఎంట్రీ చాలా ఈజీగానే జరిగింది. అందులో పల్లెటూరి పేద పిల్లగా నటించిన రోజా.

తర్వాత ఎన్నో గ్లామరస్ పాత్రలు పోషించింది.పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద భ్యానర్లలో నటించింది.మీనా,రమ్యక్రిష్ణ,నగ్మా లాంటి తోటి హీరోయిన్లతో కలిసి చాలా సినిమాల్లో నటించినప్పటికి తనదైన ముద్రవేసింది.రోజా భర్త సెల్వమణి..చామంతి సినిమా అప్పుడు పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.రోజా నటించిన చామంతి సినిమాకు దర్శకుడు సెల్వమణి.

తర్వాత సెల్వమణి దర్శకత్వంలో రోజా నిర్మాతగా ఒక సినిమా తీయడం.అది అట్టర్ ప్లాప్ అయ్యి రోజా భారీ నష్టాల్లో కూరుకుపోవడం జరిగాయి. ఆ కష్టాలన్ని తీరడానికి ఏడేళ్లు పట్టింది..ఆ తర్వాతే రోజా సెల్వమణి పెళ్లిచేసుకున్నారు..మొదటినుండి సెల్వమణి రోజాకు తోడుగి నిలుస్తూ వచ్చారు. ఆఖరుకి ఇప్పుడు రాజకీయాల్లో కూడా భర్త ప్రోత్సాహమే కారణమని ఒక సంధర్బంలో చెప్పారు రోజా.
Roja – MLA from Nagari Constituency
రోజా సెల్వమణి లకు ఇద్దరు పిల్లలు. అన్షుమాలిక సెల్వమణి..ఇటీవల అన్షుమాలిక హాఫ్ సారీ ఫంక్షన్ వీడియోస్ నెట్లో హల్ చల్ చేస్తూ ,అన్షు కూడా సినిమాల్లోకి వస్తుందనే వార్తలు వచ్చాయి..సినిమా నటుల పిల్లలు సినిమాల్లోకి రావడం ఇప్పుడు కొత్తేంకాదు..మరి అన్షు ఎంట్రీ ఎప్పుడుంటుందో…అమ్మలాగే గ్లామర్ పాత్రలు పోషిస్తుందొ లేదంటేతనదైన ముద్రవేస్తుందో వేచి చూడాలి..