లక్ష్మి కళ్యాణం సీరియల్ హీరోయిన్ లక్ష్మి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?
వెండితెర కన్నా బుల్లితెర మీద నటించిన వాళ్లకు గమ్మున గుర్తింపు వస్తోంది. బుల్లితెర సీరియల్స్ ప్రభావం జనాలపై అంతగా వుంది. ఇక లక్ష్మి కళ్యాణం సీరియల్ గత మూడేళ్ళుగా విజయవంతంగా నడుస్తోంది. ఇక ఈమె తండ్రి ఓ ప్రయివేట్ సంస్థలో సాధారణ ఉద్యోగి. తల్లి సాధారణ గృహిణి. ఇక నటన పరంగా వీళ్ళ ఇంట్లో అనుభవం ఉన్నవాళ్లు ఎవరూ లేరు. ఈ సీరియల్ లో హీరోయిన్ పాత్ర పేరు లక్ష్మి. ఈ పాత్రను హర్షిత పోషిస్తోంది. ఈమె అసలు పేరు హర్షితా వెంకటేష్. ఈమె కర్ణాటక లోని ఓ గ్రామంలో పుట్టి పెరిగింది. 5ఏళ్ళవయస్సు నుంచి బెంగుళూరులోనే ఉంది.
చిన్ననాటినుంచి మ్యూజిక్, డాన్స్,స్టేజ్ ప్రదర్శనలు ఇలా అన్నింటిపై చాలా ఇష్టం ఉండేది. ఈమె స్టడీలో కూడా నెంబర్ వన్. కాలేజీ డేస్ లో స్టేజ్ షోలు వేయడం వలన మా టివిలో అష్టా చెమ్మా సీరియల్ లో లీడ్ కేరెక్టర్ స్వప్న కేరక్టర్ వచ్చింది. రెండు మూడు నెలలు షూటింగ్ కూడా అయింది. అయితే ఓ పక్క ఎంబీఏ చదువు, తమిళంలో ఒకటి,కన్నడంలో రెండు సీరియల్స్ ఉండడం వలన అష్టా చెమ్మా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది.
లక్ష్మి కళ్యాణం మొదలుకాకముందు 5ఏళ్ళక్రితం కన్నడ,తమిళ సీరియల్స్,స్టేజ్ షోలు చేసింది. ఇక కన్నడ, తమిళ సీరియల్స్ కి డైరెక్షన్ కూడా చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి, అన్నీ దగ్గరుండి చూసుకుంటూ,స్క్రిప్ట్ రైటర్ గా మారి, ఆతర్వాత డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో కి వెళ్లే సమయంలో లక్ష్మి కళ్యాణం సీరియల్ హర్షిత ను పలకరించింది.
కథ విని,ఇది మంచి పేరు తెస్తుందని భావించి, అందివచ్చిన ఛాన్స్ ఒప్పేసుకుంది. దీంతో లక్ష్మి కల్యాణంలో లక్ష్మి అవతారం ఎత్తేసి మెప్పిస్తోంది. భవిష్యత్తులో ప్రాధాన్యం గల పాత్రలతో సినిమాల్లో చేస్తానని హర్షిత చెబుతోంది. ఇక స్క్రిప్ట్ బాగా రాసి, ఎప్పటికైనా మంచి డైరెక్టర్ కావాలని ఉందని అంటోంది.