Tollywood:“హలో” సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి కొన్ని నిజాలు
Hello Movie Child Artist:సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించాలంటే చాలా అందం,అదృష్టంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. మనకు చైల్డ్ ఆర్టిస్ట్ లు అంటే షామిలి,షాలిని,తరుణ్,బాలాదిత్య వంటి వారు గుర్తుకు వస్తారు. ఇప్పుడు వారి జాబితాలో మైఖేల్ గాంధీ కూడా చేరిపోయాడు. మైఖేల్ గాంధీ ఎవరా అని ఆలోచిస్తున్నారా? అదేనండి అఖిల్ హీరోగా వచ్చిన ‘హలో’ సినిమాలో అఖిల్ చిన్నప్పటి పాత్రను వేసింది మైఖేల్ గాంధీనే. ఇప్పుడు మైఖేల్ గాంధీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
సుప్రీం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఆ సమయానికి మైఖేల్ గాంధీ వయస్సు 7 సంవత్సరాలు. తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు.
శ్రీలంక,పాకిస్తాన్ కి చెందిన యాడ్స్ లో ఎక్కువగా కన్పిస్తూ ఉంటాడు.
మైకేల్ ఎన్ని యాడ్స్ లో నటించిన సరే తనకు సినిమాలంటేనే ఇష్టమని అంటున్నాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ బయో పిక్ తీస్తున్న సమయంలో సచిన్ చిన్నప్పటి పాత్ర కోసం చాలా వడపోతల తర్వాత మైకేల్ ని ఎంపిక చేసారు. ఆలా అతని సినిమా కల నిజమైంది. అయితే ఆ కల అంత సులువుగా నెరవేరలేదు. కొన్ని వేల మంది చిన్నారులలో మైకేల్ సెలక్ట్ అయ్యాడు.
బిలియన్ డ్రీమ్స్ సినిమా ప్రమోషన్ కి మైఖేల్ ఎక్కడికెలితే అక్కడ జనం ఎగబడ్డారు.
సచిన్ బయో పిక్ లో తన నటనతో అందరిని ఆకట్టుకోవడంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
సుప్రీమ్ ,బిలియన్ డ్రీమ్స్ సినిమాలో మైఖేల్ నటన చూసిన నాగార్జున ఫిదా అయ్యిపోయి హలో సినిమాలో అఖిల్ చిన్నప్పటి పాత్రకు సెలక్ట్ చేసాడు. హలో సినిమాలో మైకేల్ నటన చూసిన వారంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 8 సంవత్సరాలకే నటనతో అందరిని ఆకట్టుకున్న మైకేల్ గాంధీకి హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయని చూసిన వారందరు అంటున్నారు.
ఆ తర్వాత ఈయన వెండితెర కంటే కూడా ఎక్కువగా బుల్లితెర కి పరిమితం అయిపోయాడు.హిందీ లో వరుసగా ఈయన ‘టైప్ రైటర్’, ‘మెంటల్ హుడ్’ , ‘హిస్ స్టోరీ’ మరియు ‘మై : ఏ మథెర్స్ రేజ్’ వంటి వెబ్ సిరీస్ లలో నటించాడు.