జనసేన సీట్స్ కోసం కసరత్తు ఎలాగో తెలుసా ? ఎలా సెలెక్ట్ చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
రాజకీయ పార్టీ అన్నాక చివరకు అధికారంలోకి రావడమే లక్ష్యం. కొన్ని పార్టీలు ఎప్పటికీ అధికారంలోకి రాకుండా ఉంటే , కొన్ని పార్టీలు పెట్టిందే తడవుగా సత్తా చాటి అధికారంలోకి వచ్చేస్తాయి. కొన్ని పార్టీలు నడపలేక మూతపడ్డామో, విలీనం అవ్వడమే జరుగుతాయి. ఇక మొన్నటి ఎన్నికలముందు పుట్టిన జనసేన పార్టీ పోటీ చేయకుండా బిజెపి,టిడిపి లకు మద్దతు ఇచ్చింది. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీకి సై అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలో దూసుకుపోతున్నారు. పర్యటనలతో బిజీ బిజీ అయ్యారు. అయితే టిడిపి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఓ అంచనాకు వస్తుండగా, జనసేన మాత్రం తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం టికెట్ ని బిసి అభ్యర్ధికి ఖరారు చేసింది. అయితే ఇలా ఒక్క టికెట్ మాత్రమే ప్రకటించడం లోని ఆంతర్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.
నిజానికి అభ్యర్థుల ఎంపిక యవ్వారం అంత తేలిక కాదు. ఎందుకంటే ఎక్కడ పొరపాటు జరిగినా, కోపతాపాలు,తిరుగుబాట్లు,ఆఫీసులపై దాడి, బెదిరింపులు,ఇలా ఒకటా రెండా ఎన్ని ప్రయోగించాలో అన్నింటినీ ఆశావహులు ప్రయోగిస్తారు. అభ్యర్థుల ఎంపిక చాలా ఓపికతో చేయాల్సిన పని. అందుకే జనసేన ఓ కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
అదేమిటంటే,అధికార తెలుగుదేశం,ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ లలో టికెట్స్ రాక, అలక వహించిన వాళ్ళను చేరదీసి టికెట్స్ ఇవ్వాలని భావిస్తోందట. ఇతర పార్టీల్లో అసంతృప్తులు గాలం వేయడానికి జనసేన నేతలు రెడీ గా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్స్ కి మళ్ళీ టికెట్స్ ఇచ్చేస్తే, ద్వితీయ శ్రేణి నాయకులు ఇక తమకు జీవితంలో పోటీచేసే ఛాన్స్ రానట్టేనా అని అసంతృప్తితో ఉంటారు.
అలాంటి వారిని ఆకర్షించి టికెట్లు ఇవ్వాలని కూడా జనసేన వ్యూహకర్తలు యోచన చేస్తున్నారట. ఇలాంటి ద్వితీయ శ్రేణి జాబితాను సిద్ధం చేస్తున్నారట. దీన్ని బట్టి రెండు పార్టీల్లో టికెట్లు రావని భావించినవాళ్లు, ప్రజల్లో పట్టున్నవాళ్లను జనసేనలోకి తీసుకొచ్చే బాధ్యతను కొందరికి అప్పగించారట.
ఆ విధంగా ఇటీవల జనసేనలో చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే గుంటూరు,కృష్ణా జిల్లాలలో ఇలాంటి బాధ్యతను చేపట్టారట. అందుకే గుంటూరులోని వైసిపి అసంతృప్తి నేతలు మర్రి రాజశేఖర్,లేళ్ళ అప్పిరెడ్డి,టిడిపి మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జున్,తదితరులతో నాదెండ్ల టచ్ లో ఉన్నారట.