Movies

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమాకు ఇలియానా మైనస్ అవుతుందా…. శ్రీను వైట్ల నిర్ణయం తప్పా?షాక్ లో రవితేజ

గోవా బ్యూటీ ఇలియానా అనగానే సన్నటి నాజూకు అందాలు గుర్తుకు వప్తాయి. జీరో సైజ్‌లో ఉంటూ ఎన్నో చిత్రాల్లో నటించిన ఇల్లీ బేబికి కుర్రకారు ఫిదా అయిపోతారు. గతకొంత కాలంగా ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. దాంతో బాలీవుడ్‌లో అడపాదడపా చిత్రాల్లో నటించింది. ఇక బాలీవుడ్‌లో కూడా ఈ అమ్మడి చాప్టర్‌ క్లోజ్‌ అయ్యిందనే టాక్‌ కూడా వినిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఈ అమ్మడికి తెలుగులో నటించే ఆఫర్‌ వచ్చింది. అది కూడా మాస్‌ మహారాజ్‌ రవితేజ సరసన నటించే ఛాన్స్‌. దాంతో ఇల్లీ బేబి అభిమానులు ఫుల్‌ ఖుషీ అయ్యారు.

ఈమె నాజూకు అందాలను తెరపై మరొక చూసి పడంగ చేసుకోవచ్చు అనుకున్నారు. తాజాగా ఇల్లీ బేబి లావైనా ఫొటోలు కొన్ని నెట్‌లో హల్‌చల్‌ చేశాయి. లావైనా ఇలియానా అభిమానులను సైతం నిరాశకు గురి చేస్తోంది. దాంతో అవి ఇల్లీ ఫొటోలు కాదు ఎవరో మార్ఫింగ్‌ చేశారు అనే టాక్‌ కూడా వినపించింది. రవితేజ నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్ర టీజర్‌ తాజాగా విడుదలయింది.

ఈ టీజర్‌లో కూడా ఇలియానా లావుగా కనిపించింది. దాంతో ఆ ఫొటోలు మార్ఫింగ్‌ కాదు నిజమే అనే క్లారిటీ వచ్చింది.ఈ టీజర్‌లో ఇల్లీ బేబి ఎబ్బెట్టుగా ఉంది. లావైన శరీరాకృతితో ఆకర్షణాయంగా లేదు. మొహం కూడా ఉబ్బుగా కనిపిస్తోంది. ఇలియానాను ఇలా చూసి అభిమానులు చాలా నిరాశ పడుతున్నారు.ఈ చిత్రానికి ఇల్లి బేబియో పెద్ద మైనస్‌ అవుతుందా?

అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కెరీర్‌లో చాలా సినిమాలను సన్నగా, నాజూగ్గా చేసిన ఇల్లీ బేబిని ఇలా చూసిన వారు ఎవరు కూడా ఇష్ట పడడం లేదు. మరి సినిమాలో తన పాత్ర ఏమైనా ఆకట్టుకుంటుందా చూడాలి. ఆ తర్వాత అవకాశాలు రావడం కూడా గగనమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.