Movies

రాధిక తండ్రి M.R.Radha మరణం ఎంత దారుణమో తెలుసా…. ఎవరికీ ఈ పరిస్థితి రాకూడదు

నటుడిగా గుండెల్లో గుడి కట్టుకున్న అభిమానులు తీరా ఆ నటుడు రియల్ లైఫ్ లో విలన్ గా మిగిలిపోవడంతో అభిమానులు దూరంగా ఉండిపోయారు. అయితే అతడు మరణించినపుడు మాత్రం అతని కడచూపుకోసం అభిమానులు తరంగమై కదిలివచ్చారు. ఇదేదో సినీ కథ కాదు. నిజంగా తమిళ నటుడు ఎం ఆర్ రాధా విషయంలో చోటుచేసుకుంది. రంగస్థల నటుడిగా జీవితం ప్రారంభించి, సినీ నటుడిగా ఉన్నత శిఖరాలు అందుకున్న రాధా చివరిదశలో అభిమానులు సైతం పలకరించడానికి కూడా నోచుకుకుండా ఒంటరిగా ఉంటూ తుదిశ్వాస విడిచారు. ఈయన అసలు పేరు మద్రాస్ రాజగోపాల రాధాకృష్ణ నాయుడు.

ఎం ఆర్ రాధా చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయి,నాటక ప్రదర్శనలో పాల్గొన్నాడు. ఆవిధంగా నాటకాల్లో పాత్రలు వేస్తూ, మంచి రంగస్థల నటుడిగా గుర్తింపు పొందారు. ఈయన సొంతంగా రాసిన నాటకం జనరంజకంగా నిల్చింది. అదే రక్తకన్నీరు నాటకం.

ఆతర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టి లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో ఈయనకు నచ్చినట్లు కథ రాయించుకుని స్థాయినుంచి ఈయన కోసమే కథ రాసే స్థితికి పరిస్థితి వచ్చింది. అయితే ఆదరించిన అభిమానుల దృష్టిలో అయన అనుకుండా విలన్ అయ్యారు.

తమిళనాడు ప్రజల ఆరాధ్య దైవం ఎంజీఆర్ మీద దాడి జరిగింది. ఆ దాడి ఘటనలో ఎంజీఆర్ గుండెల్లోకి తూటాలు దూసుకెళ్లాయి. ఎం ఆర్ రాధా కి కూడా బుల్లెట్ల గాయాలు అయ్యాయి.మొత్తానికి ఇద్దరూ ప్రమాదం నుంచి బయట పడ్డారు. దర్యాప్తు చేస్తే, ఆ తుపాకి రాధా దేనని తేలింది. అయితే ఆ తుపాకీ లైసెన్స్ అయిపోయి మూడేళ్లు అయింది. దీంతో ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాక రాధాను అరెస్టు చేసారు.

దీంతో ప్రజల దృష్టిలో విలన్ గా మారిపోయాడు. కొన్నాళ్ళకు జైలునుంచి బయటకు వచ్చాడు.అయితే వయస్సు మీదపడడంతో సినిమా అవకాశాలు పోయాయి. ఇక ఆరోగ్యం క్షీణించడంతో 8ఏళ్లపాటు అందరికీ దూరంగా ఒంటరిగా బతికి,పచ్చకామెర్లు సోకి తుదిశ్వాస విడిచారు. అప్పటిదాకా దూరంగా ఉన్న అభిమానులు అప్పుడు మాత్రం పెద్దఎత్తున తరలివచ్చి తమ అభిమాన నటుడికి కడసారి వీడ్కోలు పలికారు. కాగా స్టార్ హీరోయిన్ రాధికా,నిరోషా ఈయన కుమార్తెలే.