పుట్టినరోజు సందర్భంగా అనుష్క గురించి ఈ విషయాలు మీకు తెలుసా?నమ్మలేని నిజాలు
అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లోకి రాక ముందు యోగ టీచర్ గా పనిచేసేది. ఆమెకు మొదట్లో నటన రాకపోయినా కస్టపడి ఈ స్థాయికి వచ్చింది.
సినిమాల్లో కనపడే అనుష్కకు బయట కనపడే అనుష్కకు చాలా తేడా ఉంటుంది. సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా వస్త్రధారణ ఉన్నా, బయట మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్కువగా చీరలు,చుడీదార్స్ ని ఇష్టపడుతుంది. బంగారు ఆభరణాలు కూడా ఎక్కువగా ధరించదు.
పూరి జగన్నాద్ అనుష్క ఫోటో అడిగితే పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చిందట. అప్పుడు పూరి పెద్దగా నవ్వేసి సూపర్ ఆడిషన్స్ కి రమ్మని చెప్పారట. అక్కడ ఫోటోలకు ఫోజ్ ఎలా ఇవ్వాలో నాగార్జున నేర్పించారట.
సినిమాల్లో చాలా దైర్యంగా నటించే అనుష్కకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయమంట.
ఇప్పటివరకూ మూడు సార్లు ద్విపాత్రాభినయం చేసింది అనుష్క. .ఆ మూడు సినిమాలు అరుందతి,పంచాక్షరి,వర్ణ.
రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు,బాహుబలి సినిమాల్లో నటించింది.
ఇప్పటివరకూ మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,రెండు నంది అవార్డులు ,మూడు సినెమా అవార్డులు అందుకుంది అనుష్క.
ఫోన్ తక్కువగా వాడుతుందట..న్యూస్ కి ,సోషల్ మీడియాకి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటుందట అనుష్క.
టాలివుడ్లో అధిక పారితోషికం తీసుకునే నటి అనుష్కే.
నటజీవితానికి స్వస్తి చెప్పాక చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ బతకాలనుకుంటుందట.ప్రయాణాలంటే కూడా అనుష్కకి ఇష్టం.
బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్,అభిషేక్ బచ్చన్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది.
సూపర్ నుండి బాగమతి వరకూ ఏన్నో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించింది అనుష్క .దేవసేన, రుద్రమదేవి, భాగమతి ,అరుందతి ఈ పేర్లు వింటే చాలు ప్రేక్షకుల కళ్లముందు అనుష్కే కనపడుతుందంటే తన నటనతో ఎంతగా మెప్పించిందో అర్దం చేసుకోవచ్చు.