బోయపాటి ప్రతి సినిమా టీజర్‌లో కామన్‌గా కనిపించే 7 విషయాలు….నమ్మలేని నిజాలు
Tollywood Director Boyapati:బోయపాటి సినిమా వస్తోందంటే మాస్ ప్రేక్షకులకు ఒక రకమైన పండగ లాంటిదే. సోషల్ మీడియాలో బోయపాటి-గ్రావిటీ అంటూ ఎన్ని జోకులు వేసుకున్నా బోయపాటి సినిమా అనగానే కొన్ని ఆశిస్తాం. ప్రేక్షకులు కోరుకునేది సరిగ్గా అంచనా వేసి అందించే అరుదైన దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పుడు బోయపాటి సినిమా టీజర్‌లో కామన్‌గా కనిపించే 7 విషయాల గురించి తెలుసుకుందాం.
బోయపాటి సినిమా అంటే ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి టీజర్ లో ఎమోషనల్ షాట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు.
బోయపాటి సినిమాల్లో హీరోకి ఒక ప్రత్యేకమైన ఆయుధం ఉంటుంది. స్పెషల్ గా డిజైన్ చేస్తాడు బోయపాటి.
హీరోల చేత ఒక మాస్.. ఊర మాస్ డైలాగ్ షాట్స్ ఖచ్చితంగా ఉంటాయి. వినయ విధేయ రామ సినిమా తీసుకుంటే.. రామ్.. రామ్ కొ.. ణి.. దె.. ల అని చెప్పించిన విధానం మాస్ ప్రేక్షకులను థియేటర్లో సీట్లో కుదురుగా కూర్చోనివ్వదు.
విలన్ పవర్ ఫుల్ గా ఉంటే హీరో బాగా ఎలివేట్ అవుతాడని బలంగా నమ్ముతాడు బోయపాటి శ్రీను.
బోయపాటి. ప్రతీ సినిమా టీజర్లోనూ ఒక జాతర సీన్ లేదా ఒక పూజ సీన్ కట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
బోయపాటి సినిమాల్లో హీరోలు లేదా విలన్లు, కుదిరితే ఇద్దరూ గాల్లోనే ఫైటింగులు గట్రా చేసేసుకుంటారు. అందుకే సోషల్ మీడియాలో బోయపాటికి గ్రావిటీ అంటూ జోకులు ఎక్కువగా పేలుతూ ఉంటాయి.
ఇక టీజరైనా, ట్రైలరైనా చివర్లో బోయపాటి శ్రీను పేరు విత్ ఫోటో పడాల్సిందే.