10 Th క్లాస్ సినిమా హీరో భరత్ తాత పెద్ద నిర్మాత… అన్నయ్య స్టార్ హీరో…ఎవరో మీకు తెలుసా?
సినిమా పరిశ్రమలో కొందరికి ఛాన్స్ లు అనుకోకుండా కల్సి వస్తాయి. మరికొందరు ఎంత ప్రయత్నించినా,బ్యాక్ గ్రౌండ్ వున్నా సరే,ఛాన్స్ లు రావు. సరిగ్గా ఓ వర్ధమాన హీరో విషయంలో ఇదే జరుగుతోంది. ఓపక్క తాతయ్య మెగాస్టార్ కి హిట్ సినిమా అందించిన స్టార్ ప్రొడ్యూసర్ కాగా, అన్నయ టాప్ హీరో అయితే ఏం లాభం ఆ వర్ధమాన హీరోకి అడుగు ముందుకు పడడం లేదు. వివరాల్లోకి వెళ్తే, 2004లో రవితేజ హీరోగా నటించిన ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ మూవీలో రవితేజ చిన్నప్పటి గెటప్ లో అదరగొట్టిన భరత్, టెన్త్ క్లాస్ సినిమాతో హీరోగా మంచి హిట్ అందుకున్నాడు.
ఆతర్వాత 2008లో సవాల్ చిత్రంలో హీరోగా నటించిన భరత్ కి అనుకున్న విజయం రాలేదు.
ఇదే చిత్రం లో హీరోగా నటించాడు. ఇంతకీ ఇతని తాతగారు ఎవరో తెలుసా?ఆయన స్టార్ ప్రొడ్యూసర్. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రుద్రనేత్ర సినిమాను తీసిన బీహెచ్ వరాహ నరసింహరాజు. ఈ సినిమా మంచి హిట్ అయింది. స్వయానా ఈయన మనవడే అయిన భరత్ సరైన ఛాన్స్ లు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.
అంతేకాదు, హీరో రవితేజ, మరో హీరో రాజారవీంద్ర వీళ్ళిద్దరూ కూడా భరత్ కి అన్నయ్యలు అవుతారు. అయితే భరత్ కి సినిమాల్లో తగిన అవకాశాలు లేకున్నా, బిజినెస్ పరంగా పలు వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నాడు. అందుకే సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. ఎంత బ్యాక్ గ్రౌండ్ వున్నా, టాలెంట్ ఉన్నా సరే, సినీ రంగంలో రాణించాలని లక్కు కూడా ఉండాలని భరత్ ని చూస్తే తెలుస్తుంది.