Movies

టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా…సినిమాల్లోకి రావటానికి కారణం?

తెలుగులోకి బాలీవుడ్ భామలు ఎక్కువగా దిగుమతి అవుతున్నారు. దాంతో వాళ్లదే హవా. బాలివుడ్ లేని క్రేజ్ వాళ్లకు టాలీవుడ్ లో వస్తున్నందున ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. అయితే టాక్సీవాలా చిత్రంలో హీరోయిన్ గా నటిసున్న ప్రియాంక జవాల్కర్ ని చూస్తే ఉత్తరాది అమ్మాయి అనుకుంటారు. కానీ ఈమె తెలుగమ్మాయే. నిజానికి మరాఠీకి చెందిన ఈమె కుటుంబం తాతల కాలం నుంచే ఆధ్రలో సెటిల్ అయ్యారు. అనంతపురంలో వస్త్ర దుకాణాలు నడుపుతున్నారు. అలాగే ఆమె బంధువులు కూడా చాలామంది అనంతపురం చుట్టుపక్కల వస్త్ర వ్యాపారాల్లో ఆరితేరారు.

టాక్సీవాలా సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా,ఈసినిమా సైన్స్ ఫిక్షన్ జోనల్ లో తీస్తున్నారు. ఈమధ్య ఇలాంటి సినిమాలు రావడం లేదు. ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్న ఈ మూవీ సైన్టిఫిక్ థ్రిల్లర్ మూవీ గా చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ హీరో కావడంతో భారీ హైప్ నెలకొంది. ఈనెలలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్న టాక్సీ వాలాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న నేపథ్యంలో ఈమె తెలుగు అమ్మయేనని విజయ్ చెప్పుకొచ్చాడు.

సినిమా రిలీజ్ కి ముందే ఈ అమ్మడికి భారీ పబ్లిసిటీ వచ్చేసింది.అనంతపురంలో సెటిల్ అవ్వడం వలన ప్రియాంక ఇంట్లో మరాఠీ – తెలుగు మిక్స్ చేసి మాట్లాడేస్తారట. కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేసిన ఈమె ఫ్యాషన్ అండ్ క్లోతింగ్ లో డిప్లొమా చేసింది. చూడగానే ఆకట్టుకునే అందం కావడంతో ఇంజనీరింగ్ లో ఉండగా షార్ట్ ఫిలిం లలో ఛాన్స్ లు రావడంతో కలవరమాయే మదిలో షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేసింది.

2016లో హైదరాబాద్ భిక్షు యాక్టింగ్ స్కూల్ లో చేరి నటనలో ఓనమాలు దిద్దికుంది. ఇక గీతా ఆర్ట్స్ ఆడిషన్స్ జరిపితే ఫోటోలు పంపించడమే కాదు లైవ్ ఫెరఫార్మెన్స్ ఇచ్చింది. ఆ విధంగా టాక్సీవాలా మూవీలో ఛాన్స్ కొట్టేసింది.

ఈ సినిమాలో మందుకొట్టి కారులో ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఈ అమ్మడు నిజంగానే హుక్కా తాగి కారులో ఎక్కి రియల్ గా యాక్ట్ చేయడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈమె డెడికేషన్ కి విజయ్ దేవరకొండ ఫిదా అయ్యాడు.