Movies

మహేష్ బాబు మల్టీ ఫ్లెక్స్ ధియేటర్ లోపల ఉన్న స్పెషల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

సినిమాల్లో తమకంటూ స్టార్ డమ్ క్రియేట్ చేసుకుని,సక్సెస్ ఫుల్ హీరోలుగా రాణిస్తున్న ఈ తరం హీరోలు సైడ్ బిజినెస్ లపై దృష్టి పెడుతున్నారు. బన్నీ,తారక్ వంటి వాళ్ళు అనేక రకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా,తనకంటూ ఓ మార్కెట్ ని క్రియేట్ చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో ఆచితూచి అడుగులేస్తూ టాప్ రేంజ్ కి చేరిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భరత్ అను నేను మూవీ ద్వారా బ్లాక్ బ్లస్టర్ అందుకుని మంచి జోష్ లో ఉన్నాడు. మహేష్ కూడా సైడ్ బిజినెస్ పై దృష్టి పెడ్తున్నాడు. స్పైడర్ దారుణంగా దెబ్బతిన్నాక, భరత్ అను నేను మూవీ తో రికార్డులు బద్దలు కొడుతూ మళ్ళీ తన రేంజ్ ని పటిష్టం చేసుకున్నాడు. ఒక ప్లాప్ వచ్చినంత మాత్రాన, తన మార్కెట్ ని ఎవరూ ఊహించలేరని చాటిచెప్పాడు.

ఇక సినిమాలతో సంబంధం గల బిజినెస్ లను ఎంచుకుని తన ప్రత్యేకత చాటుకుంటున్న మహేష్ బాబు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ సంస్థతో కల్సి మహేష్ బాబు మల్టిప్లెక్స్ థియేటర్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. ఏపీలో ప్రధాన పట్టణాల్లో మహేష్ బాబు భాగస్వామ్యంతో ఏషియన్ సినిమాస్ సంస్థ మల్టిప్లెక్స్ థియేటర్ ల నిర్మాణం చేప్పట్టబోతోంది.

ఇందులో భాగంగా గచ్చీబౌలి సమీపంలో ఏ ఎం బి పేరిట మల్టిప్లెక్స్ నిర్మించారు. హిందీ సినిమాతో ఓపెనింగ్ చేయాలనీ భావించినా, కుదరక పోవడంతో రజనీకాంత్ నటించిన రోబో 2.0 సినిమాతో ఓపెన్ చేయాలని నిర్ణయించారట. ఈ మల్టి ప్లెక్స్ లో లగ్జరీ కి అనుగుణంగా 7భారీ స్క్రీన్స్ ఏర్పాటుచేశారట. యుఫోమ్ సీటింగ్,లాజ్ ఫుట్ రెస్ట్,కంప్లైట్ ఫుష్ బ్యాక్ సిస్టం తో సీటింగ్ అమర్చారు. హాలులో లైట్స్ వెలుగుతున్న సరే,తెరపై ప్రభావం పడకుండా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ విధానం ప్రవేశపెట్టారట.

ఇక్కడ దొరకని ఐటెం కూడా ఉండదట. పైగా కంటికి ఇబ్బంది లేకుండా ఉండేలా లేజర్ ప్రొజక్టర్ సిస్టం అమర్చారట. అమెరికా, సింగపూర్,హాంగ్ కాంగ్ వంటి దేశాలకు పరిమితమైన ఈ విధానం ఇప్పుడు ఏపీలో వచ్చేసింది. ఇక తాజాగా మహర్షి మూవీలో మహేష్ నటిస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చే ఈ మూవీ మరపురాని చిత్రంగా ఉంటుందని భావిస్తున్నాడు.