రవితేజ కెరీర్ లో బెస్ట్ రోల్స్ …. ఏమిటో తెలుసా?
రవితేజ మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. పెద్దగా గుర్తింపు రాకపోవటంతో డైరెక్టర్ కృష్ణ వంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవాడు. 1997 లో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేసాడు. ఆ పాత్ర క్లిక్ కావటంతో వరుస అవకాశాలు వచ్చిన బ్రేక్ రాలేదు. 1999 లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘నీ కోసం ‘లో రవితేజ హీరోగా చేసాడు. హీరోగా బ్రేక్ రాకపోయినా హీరోగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ‘ఇడియట్ ‘ సినిమాతో ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. ఈ రోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా రవి తేజ కెరీర్ లో బెస్ట్ రోల్స్ గురించి తెలుసుకుందాం.
సిందూరం
1997 లో వచ్చిన ‘సింధూరం’ సినిమాలో రవితేజ వేసిన చంటి పాత్ర ఇప్పటికి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
వెంకీ
శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ సినిమా రవితేజను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది. యాక్షన్ సీన్స్, డ్యాన్సులు,కామెడీ టైమింగ్ అన్ని ప్రేక్షకులకు నచ్చాయి.
ఇడియట్
ఈ సినిమాలో చంటి…లోకల్ అంటూ ఉండే రవితేజ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఒకవిధంగా ఈ సినిమాను యూత్ హిట్ చేసారని చెప్పవచ్చు.
విక్రమార్కుడు
ఈ సినిమాలో దొంగ అత్తిలి సత్తి బాబు, ఏఎస్పీ విక్రమ్ సింగ్ రాథోడ్ గా ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు.
నేనింతే
ఈ సినిమాలో సినిమా వాళ్ళ కష్టాలను కళ్ళకు కట్టినట్టు పూరీ జగన్నాథ్ బాగా చూపించాడు. దానికి తగ్గట్టుగానే రవితేజ కూడా బాగా యాక్ట్ చేసారు.
కిక్
కిక్ లో కామెడీ,యాక్షన్ మిక్స్ చేసి నటించి అందరికి కిక్ వచ్చేలా చేసాడు.
శంభో శివ శంభో
ఈ సినిమాలో నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. స్నేహితుడు ఎలా ఉంటాడో నటించి మెప్పించాడు.
ఖడ్గం
కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమాలో సినిమా ఛాన్స్ ల కోసం తిరిగే యువకుడిగా బాగా నటించాడు. ఈ సినిమాతో రవితేజ తొలి నందిని అందుకున్నాడు.
పవర్
పవర్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో చేసి చూపించిన రవితేజ శభాష్ అనిపించుకున్నాడు.
రాజా ది గ్రేట్ “ఐ యామ్ బ్లైండ్.. బట్ ఐ యామ్ ట్రైన్డ్” అంటూ రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అదరగొట్టారు. స్టార్ హీరోలు ఎవరు సాహసం చేయని అంధుడి పాత్రను తీసుకొని.. అలరించాడు.