సూపర్ సింగర్ బాబా సెహగల్ గురించి ఈ విషయాలు తెలుసా ?నమ్మలేని నిజాలు
అటు బాలీవుడ్ లో గానీ ఇటు టాలీవుడ్ లో గానీ ఎందరో గాయకులున్నారు. కొందరు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అలా చెప్పుకుంటూ వస్తే, ఇండియాలో అర్జిత్ సింగ్ సెహగల్ అంటే తెలియక పోవచ్చు గానీ బాబా సెహగల్ అనగానే అందరూ ఠక్కున ఎవరో చెప్పేస్తారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అనేక భాషల్లో తన పాటలతో ఉర్రూతలూగించిన బాబా సెహగల్ మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తెలుగులో పాడిన పాటలు ఇంకా ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. అయితే అతనికి పెళ్లి కల్సి రాలేదు. అంజు అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా,తన్వీర్ అనే కొడుకు పుట్టాడు. కానీ వీరి వైవాహిక జీవితంలో తేడాలు రావడంతో 2010లో విడిపోయాడు.
1965నవంబర్ 23న ఉత్తరప్రదేశ్ లోని లక్నో నగరంలో జన్మించిన బాబా సెహగల్, చిన్నప్పటినుంచి చదువులో ముందంజలో ఉండేవాడు. పంజాబీ కుటుంబం అయినప్పటికీ ఆధునికంగా పెరిగాడు. జి బి పంత్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసాడు. కాలేజీ రోజుల్లో పాటలు రాసి పాడేవాడు. అలా సరదాగా పాడిన పాటలు అతనికి ఎందరో గర్ల్ ఫ్రెండ్స్ ని పరిచయం చేశాయి.
అమెరికన్ స్టైల్లో అతని పాటలు ఉండడం వలన ర్యాప్ ఆల్బమ్స్ చేయమంటూ మ్యూజిక్ కాసెట్స్ కంపెనీలు ప్రోత్సహించాయి. ఫలితంగా దిల్ రూబా ఆల్బమ్ వచ్చింది. 1990లో ఇండియాలో ఎంటివి వచ్చిన రోజులుకావడంతో ఇండియా నుంచి రాప్ తో అదరగొట్టాడు బాబా సెహగల్.లేకపోతె యూత్ అంతా అమెరికా యూరప్ పాటలను ఆసక్తిగా వింటున్న సమయంలో బాబా సెహగల్ తన పాటలతో మలుపు తిప్పాడు. ఆలీబాబా అనే మరో ఆల్బమ్ తో ఉర్రూతలూగించిన ఇతగాడు, థండ థండ పానీ ఆల్బమ్ తో యూత్ లో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
అన్ని వైపులా ఛాన్స్ లు రావడం,సినిమా పాటలు పాడాలంటూ మ్యూజిక్ డైరెక్టర్లు ఛాన్స్ లు ఇవ్వడం వంటి కారణాల వలన అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. ఇక టాలీవుడ్ లో ఛాన్స్ లు రావడంతో హైదరాబాద్ లో ఫ్లాట్ తీసుకున్నాడు. భార్యతో విడాకులు తీసుకున్న బాబా సెహగల్ అషిమా అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠా మేస్త్రీ సినిమాలో రూప్ తేరా మస్తానా, పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాలోని ‘కరో కర జల్సా ‘సాంగ్స్ ఆడియన్స్ ఇప్పటికీ వింటూనే ఉంటారు.